‘100%లవ్’, ‘1 నేనొక్కడినే’ వంటి హిట్ చిత్రాలకు కథ-స్క్రీన్ ప్లే అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ హరిప్రసాద్ జక్కా తాజాగా ‘ప్లే బ్యాక్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇండియాలోనే తొలిసారిగా క్రాస్ టైమ్ కనెక్షన్ అనే వినూత్న పాయింట్‌తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా అనన్య నాగళ్ల హీరోయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ప్రసాదరావు పెద్దినేని ‘ప్లే బ్యాక్’ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రం టీజర్ విడుదల చేశారు. అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోను ‘ప్లే బ్యాక్’ టీజర్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం మార్చి 5న రిలీజ్ కానుంది.
ఈ సినిమా ప్రి-రిలీజ్ వేడుక ఫిబ్రవరి 27న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సినీ ప్రముఖుల సమక్షంలో వినూత్నంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు పల్నాటి సూర్యప్రతాప్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన, వేమారెడ్డి, సాయి రాజేష్, రమేష్, త్రినాథ్, నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, హీరోలు దినేష్ తేజ్, అర్జున్ కళ్యాణ్, అశోక్ వర్ధన్, తేజస్ కూరపాటి, అవినాష్, బంటి, అభినవ్, హీరోయిన్ అనన్య నాగళ్ల, చిత్ర దర్శకుడు హరిప్రసాద్ జక్కా, నిర్మాత ప్రసాదరావు పెద్దినేని, టీవీ5 మూర్తి, టియన్ఆర్, టి ఆర్ యస్ సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి పాల్గొన్నారు. ‘ప్లే బ్యాక్’ ఫస్ట్ టికెట్ ను బుచ్చిబాబా సాన కొనుగోలు చేశారు.
దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ మాట్లాడుతూ.. “సుకుమార్ దగ్గర వర్క్ చేసేటప్పుడు డిస్కషన్స్ లో ఉండగా హరిప్రసాద్ కొత్తగా వెరైటీ కాన్సెప్ట్స్ చెప్తుంటాడు.. నాకు ‘ప్లే బ్యాక్’ కాన్సెప్ట్ తెలుసు. ఇది ఇన్నోవేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. టీజర్ చాలా వెరైటీగా ఉంది. 100% మంచి సక్సెస్ అవుతుంది.” అన్నారు.
‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన మాట్లాడుతూ.. “మా టీమ్ అందరికీ సుకుమార్ గారి బ్లెస్సింగ్స్ ఉంటాయి. సుకుమార్ గారికి హరిప్రసాద్ మంచి ఫ్రెండ్ కూడా. ‘ప్లే బ్యాక్’ చాలా కాంప్లికేటెడ్ స్క్రిప్ట్. ఇలాంటి కథతో సినిమా రాలేదు. రిస్క్ చేసే దగ్గరే రిటర్న్స్ వస్తాయి. ‘ప్లే బ్యాక్’ హిట్ అవుతుంది. ఆ చిత్రంతో బ్యాక్ అవకుండా హరిప్రసాద్ మరిన్ని మంచి చిత్రాలు చేయాలి”. అన్నారు.
నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను మాట్లాడుతూ.. “ప్లే బ్యాక్ సినిమా చూసి వండర్ అయ్యాను. ఇంట్రెస్టింగ్ గా సాగె స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ అనుక్షణం ఉత్కంఠ కలిగేలా ఉంటుంది. ఇలాంటి ఒక కొత్త ఐడియాతో సినిమా తీసిన హరిప్రసాద్ ఫ్యూచర్ లో పెద్ద డైరెక్టర్ అవుతాడు. కచ్చితంగా ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని బలంగా నమ్ముతున్నాను” అన్నారు.
హీరో దినేష్ తేజ్ మాట్లాడుతూ.. “ప్రేక్షకులు మంచి సినిమా వస్తే ఆదరిస్తామని ‘హుషారు’ సినిమాతో ప్రూవ్ చేశారు. మా టీమ్ అందరం కలిసి ‘ప్లే బ్యాక్’ లాంటి ఇంట్రెస్టింగ్ నావేల్టీ లవ్ స్టొరీ సినిమా చేశాం. కొత్తగా వచ్చే నాలాంటి వారిని డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేయండి. 200 పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి ప్రేక్షకులకు మంచి సినిమాలు అందిస్తాను. సినిమానే నా జీవితం. ‘ప్లే బ్యాక్’ చిత్రం అందరికీ నచ్చుతుందని నా గట్టి నమ్మకం.. ఈ అవకాశం ఇచ్చిన హరిప్రసాద్ గారికి నా థాంక్స్” అన్నారు.
హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. “మల్లేశం, హుషారు తర్వాత చేసిన సినిమా ‘ప్లే బ్యాక్’. కథకి ఇంపార్టెన్స్ ఇస్తూ.. హరిప్రసాద్ గారు ఈ సినిమా చేశారు. నాకు ఇంత మంచి క్యారెక్టర్ రావడం ప్రౌడ్ గా ఫీలవుతున్నాను. టీమ్ అందరితో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. సినిమా అందరికీ నచ్చుతుంది” అన్నారు.
చిత్ర దర్శకుడు హరిప్రసాద్ జక్కా మాట్లాడుతూ.. “మా సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరికీ నా థాంక్స్. స్క్రిప్ట్ రాయడానికి ఎంత కష్టపడ్డానో.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి నాకు ఎంతో సపోర్ట్ చేసి అంతే కష్టపడ్డాడు. ప్రతీ ఒక్కరూ వాళ్ళ లైఫ్ లో ఇంతవరకూ చూడని సినిమా ‘ప్లే బ్యాక్’ అని గ్యారెంటీగా చెప్పగలను. సెంటిమెంట్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ సీన్స్ అన్నిరకాల ఎమోషన్స్ ఈ చిత్రంలో ఉంటాయి” అన్నారు.
బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ వీడియో బైట్ ద్వారా మాట్లాడుతూ.. “హరిప్రసాద్ నాకు మంచి మిత్రుడు, ఫిలాసఫర్. ఒక బ్రదర్ లా నన్ను గైడ్ చేసేవాడు. తన గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ‘100% లవ్’, 1.. నేనొక్కడినే’ చిత్రాలకు కథ-స్క్రీన్ ప్లే అందించాడు. చాలా టాలెంట్ ఉన్న దర్శకుడు. అప్పటి నుంచీ నా దగ్గర వర్క్ చేశాడు. గొప్ప కథతో ‘ప్లే బ్యాక్’ లాంటి మంచి సినిమా చేశాడు హరిప్రసాద్. ఇద్దరు లవర్స్ మధ్య జరిగే కన్వర్జేషన్ ఎలావుంటుందో ఈ చిత్రంలో చూపించారు. అందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా పెద్ద హిట్ అయి హరిప్రసాద్ బిగ్ బ్రేక్ రావాలి” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులంతా సినిమా హిట్ కావాలని కోరుకున్నారు.
దినేష్ తేజ్, అనన్య నాగళ్ల జంటగా నటించిన ఈ చిత్రంలో స్పందన, అర్జున్ కళ్యాణ్, మాస్టర్ కార్తికేయ, అశోక్ వర్ధన్, సూర్య, టియన్ఆర్, TV5 మూర్తి, చక్రపాణి, ఐశ్వర్య లక్ష్మి, దీప్తి తదితరులు నటించారు. ఈ చిత్రానికి డివోపి; కె. బుజ్జి, మ్యూజిక్; కమ్రన్, ఎడిటింగ్; నాగేశ్వర రెడ్డి బొంతల, ఆర్ట్; జెవి, ప్రొడ్యూసర్ : ప్రసాదరావు పెద్దినేని, డైరెక్టర్: హరిప్రసాద్ జక్కా, పిఆర్ఓ; వంశీ శేఖర్, హరిణి సజ్జ, డిజిటల్ పీఆర్వో: శివ వీరపనేని, విష్ణుతేజ్ పుట్ట