నగరంలో ప్లాస్టిక్ రైస్ ఎంతగా కలకలం సృష్టించిందో అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా ప్లాస్టిక్ రైస్, ప్లాస్టిక్ ఎగ్స్ తయారవుతున్నాయని వార్తలు గుప్పుమంటుంటే.. ఒక్కసారిగా నగర ప్రజలు బెంబేలెత్తిపోయారు.
ఇప్పటికే అత్యవసర వస్తువులు ఏవి కోనాలన్నా.. కల్తీ కారణంగా భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలకు ఇప్పుడు ప్లాస్టిక్ భూతంతో మరింత కంగారు పడుతున్నారు.
అందుకే…దేశంలోకి చైనా కోడిగుడ్లు వచ్చాయా..? మార్కెట్లో అవి విచ్చలవిడిగా దొరికేస్తున్నాయా..? ఏ గుడ్డు కొన్నా అది చైనాదేనా..? అనే భయం నగర జనాల్ని వెంటాడుతోంది. ఇదే క్రమంలో తాజాగా హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లోని బేకరీలలో ప్లాస్టిక్ ఎగ్స్ దర్శనమిస్తున్నాయి. తాజాగా బేకరీలలో లభించే ఎగ్‌పఫ్స్‌లో ప్లాస్టిక్ ఎగ్ కనిపించిన ఉదంతం ఉప్పల్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే…ఉప్పల్ లోని ఓ బేకరీకి వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు ఎగ్ పఫ్స్ ఆర్డర్ చేశారు. ఎగ్‌పఫ్‌ని తింటుండగా అందులోంచి ప్లాస్టిక్ ఎగ్ బయటపడింది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న వారు… అది నిజంగా ప్లాస్టిక్ గుడ్డేనా? అనే అనుమానంతో క్షుణ్ణంగా పరిశీలించారు. చివరికి ఆ ఎగ్‌పఫ్ లో ఉన్నది ప్లాస్టిక్ ఎగ్ అని తేలిపోయింది.
ఈ ఘటనతో నగరంలో ప్లాస్టిక్ రైస్, ప్లాస్టిక్ ఎగ్స్ వచ్చేశాయన్న అనుమానం నిజమైంది. ఇప్పిటికే నగరవాసులు రైస్, గుడ్లు కొనుగోలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.
ప్లాస్టిక్ గుడ్డును ఎలా గుర్తించాలి :
* ప్లాస్టిక్ గుడ్డు గోధుమ రంగులో ఉంటుంది.
* మామూలు గుడ్డుకు వచ్చే వాసన ప్లాస్టిక్ వాటికి రాదు
* గుడ్డు పగలగొట్టిన తర్వాత ఈగలు, దోమలు వాలవు.
* ఎన్ని నెలలు అయినా గుడ్డు చెడిపోదు.
* ప్లాస్టిక్ గుడ్డు పెద్ద సైజులో ఉంటుంది.
* సాధారణ గుడ్డు కంటే మెరుపు ఎక్కువ.
* పెంకు కూడా రఫ్ గా ఉంటుంది.
* ప్లాస్టిక్ గుడ్డును ఊపగానే సౌండ్ చేస్తుంది. సహజమైన గుడ్డు ఎలాంటి శబ్దాలు చేయదు.
* ప్లాస్టిక్ గుడ్డును పగలకొట్టగానే తెల్లసొన.. పచ్చ సొన కలిసిపోతాయి.
* ప్లాస్టిక్ గుడ్డు వేపుడు చేసేటప్పుడు పచ్చసొన దానికదే ప్యాన్ లో పాకిపోతుంది.