యుఎస్‌లో విమాన ప్రమాదం..ప్రాణాలు కాపాడుకోవడానికి!

0
- Advertisement -

అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. 172 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విమానం రెక్కలపైకి చేరుకున్నారు.

ఈ ప్రమాదం అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు చెలరేగిన తర్వాత భయానక వాతావరణం ఏర్పడింది.

డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గేట్ C38 వద్ద నిలిపి ఉంచిన విమానంలో మంటలు చెలరేగాయి. టార్మాక్ పైకి దట్టమైన నల్లటి పొగ ఎగసిపడింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Also Read:Holi:ఆనంద కేళి.. హోలీ

- Advertisement -