పవన్‌తో చేయనంటున్న శృతి..

317
pavan shruthi
- Advertisement -

పవన్‌ కల్యాణ్ కాటమరాయుడు సినిమాకు డేట్లు ఆడ్జస్ట్ చేయడం కోసం.. శృతిహాసన్ కొన్ని ఆఫర్స్ ని వదిలిపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ భామ పవన్ సినిమా నుంచి కూడా తప్పుకుంటానంటూ బాంబు పేల్చిందట. గత నెలలో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు ముందుకు సాగడం లేదు. పవన్ కూడా షూటింగ్ లో జాయిన్ అవ్వలేదు. కొన్ని కారణాలతోనే సినిమా షూటింగ్‌ ఆలస్యమవుతోందని తెలుస్తోంది.

Shruthi-Hasan

పవన్ సినిమా కోసం శృతి కేటాయించిన డేట్లన్ని.. షూటింగ్‌ ఆలస్యం కారణంగా వృధా అవుతున్నాయి. దీంతో తాను ఈ సినిమా కోసం.. ఇతర ప్రాజెక్టులు వదులుకోని తప్పు చేశానని శృతి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా షూటింగ్‌ మొదలు పెట్టకపోతే… తాను ఈ సినిమా నుంచి తప్పు కోవలసి వస్తుందని దర్శకుడు మరియు నిర్మాతతో శృతి తెగేసి చెప్పిందట! ఇదిలా ఉంటే మరోవైపు రేపో మాపో పవన్ షూటింగ్ లో జాయిన్ అవుతాడని సమాచారం. ఈ నేపధ్యంలో శృతిహాసన్ పై వస్తున్న వార్తలపై చిత్రయూనిట్ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

- Advertisement -