పవన్ కల్యాణ్ కాటమరాయుడు సినిమాకు డేట్లు ఆడ్జస్ట్ చేయడం కోసం.. శృతిహాసన్ కొన్ని ఆఫర్స్ ని వదిలిపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ భామ పవన్ సినిమా నుంచి కూడా తప్పుకుంటానంటూ బాంబు పేల్చిందట. గత నెలలో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు ముందుకు సాగడం లేదు. పవన్ కూడా షూటింగ్ లో జాయిన్ అవ్వలేదు. కొన్ని కారణాలతోనే సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందని తెలుస్తోంది.
పవన్ సినిమా కోసం శృతి కేటాయించిన డేట్లన్ని.. షూటింగ్ ఆలస్యం కారణంగా వృధా అవుతున్నాయి. దీంతో తాను ఈ సినిమా కోసం.. ఇతర ప్రాజెక్టులు వదులుకోని తప్పు చేశానని శృతి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా షూటింగ్ మొదలు పెట్టకపోతే… తాను ఈ సినిమా నుంచి తప్పు కోవలసి వస్తుందని దర్శకుడు మరియు నిర్మాతతో శృతి తెగేసి చెప్పిందట! ఇదిలా ఉంటే మరోవైపు రేపో మాపో పవన్ షూటింగ్ లో జాయిన్ అవుతాడని సమాచారం. ఈ నేపధ్యంలో శృతిహాసన్ పై వస్తున్న వార్తలపై చిత్రయూనిట్ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.