‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ టీజర్‌..!

246
- Advertisement -

మాస్‌ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అమర్‌ అక్బర్ ఆంటోనీ’.ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రవితేజ.. అమర్‌, అక్బర్, ఆంటోనీగా త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఒకప్పుడు వరుస విజయాలను అందించిన శ్రీను వైట్ల .. ఆ తరువాత వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తున్నాడు. ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో రవితేజతో ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా చేస్తున్నాడు.

Amar Akbar Anthony Movie

కథాపరంగా ఈ సినిమా చాలావరకూ విదేశాల్లోనే షూటింగు జరుపుకుంటోంది. ఈ రోజున శ్రీను వైట్ల పుట్టినరోజు .. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆయనకి రవితేజ శుభాకాంక్షలు అందజేశారు. అంతే కాకుండా ఈ సినిమాలో తన షాట్స్ కి సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేశారు.

ఈ సినిమాలో రవితేజ మూడు డిఫరెంట్ లుక్స్‌తో కనిపించనున్నారు. ఆయన జోడీగా ఇలియానా కనిపించనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -