TWITTER:పిట్టను మార్చిన మస్క్‌..!

42
- Advertisement -

సంచలనమైన, వింతైన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుండే టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌…ఈ సారి ఏకంగా ట్విట్టర్‌ ను మార్చేశారు. ట్విట్టర్‌ లోగో అయిన పిట్టను తీసివేసి దాని స్థానంలో డోగ్‌ (షిబా ఇను) మీమ్‌తో అప్‌డేట్‌ చేశారు. ఇది సోమవారం నుంచి ట్విట్టర్ వినియోగ దారుల ఖాతాల్లో డోగ్‌ని గమనించారు. ఇప్పటికే సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న ట్విట్టర్ సీఈవో ఎలన్ తాజాగా ట్విట్టర్ లోగో మార్చి కొత్త మీమ్‌ను దాని స్థానంలో తీసుకొచ్చారు.

బ్లూబర్డ్‌లోగోను కాదని డాగ్కోయిన్ క్రిప్టోకరెన్సీ యొక్క డోగ్‌ను తీసుకున్నారు.దీన్ని 2013లో డోగ్‌ క్రిప్టో కరెన్సీగా డిజైన్ చేశారు. కానీ ఆప్పట్లో ఇదొక  వింతంగా భావించి లైట్‌ తీసుకున్నారు. బిట్కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీని అపహాస్యం చేయడానికి దీన్ని తీసుకువచ్చారని అంతా అనుకున్నారు. కానీ ఈ సారి అదే డోగ్‌ను  పిట్ట స్థానంలో తీసుకువచ్చారు.

ఈ సందర్బంగా ట్విట్టర్ సీఈవో ఎలన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు. అందులో కారులో ‘డోగ్’ మరియు తన డ్రైవింగ్ లైసెన్స్‌ని చూస్తున్నట్లు కనిపించే పోలీసు అధికారికి తన ఫోటో మార్చబడిందని సూచిస్తూ షేర్ చేశారు. కానీ ట్విట్టర్ మొబైల్ యాప్‌లో ఎలాంటి మార్పు చేయలేదని తెలిపారు.

ట్వట్టర్‌ను 2022 అక్టోబర్‌లో $44బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అనేక న్యాయపరమైన సమస్యల మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఇందుకోసం టెస్లాలో $8.5బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను అమ్మి మరీ కొనుగోలు చేశారు. ఇక అప్పటి నుంచి ట్విట్టర్‌లో చాలా మార్పులు తీసుకువచ్చారు. లేఆఫ్ ద్వారా ఉద్యోగులను తీసివేయడం, టిక్ మార్క్‌ ద్వారా నెలకు కొంత చొప్పున డాలర్లను వసూలు చేయడం లాంటి మార్పులను తీసుకువచ్చారు.

ఇవి కూడా చదవండి…

SUMMER:ఈసారి సమ్మర్‌.. అగ్ని కీలలే.!

HMRL:హైదరాబాద్ వాసులకు శుభవార్త..!

ఇండియాలో టాప్ టెన్ టూరిస్ట్ స్పాట్

- Advertisement -