పిస్తాపప్పు తింటే ఎన్నిలాభాలో తెలుసా?

38
- Advertisement -

డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఇష్టపడే వారికి పిస్తాపప్పు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ రూపంలోనూ లేదా ఇతర ఆహార పదార్థాలలోను, స్వీట్స్ లోనూ కలిపి తింటూ ఉంటాము. పిస్తాపప్పులో మన శరీరానికి అవసరమైన అన్నీ రకాల పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో ఫైబర్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు.. వంటివాటితో పాటు విటమిన్ ఏ, సి, డి, కె, ఇ.. వంటివి కూడా అధికంగానే ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ పిస్తాపప్పు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో కాల్షియం మరియు విటమిన్ డి ఎక్కువగా ఉండడం వల్ల ఎముకల దృఢత్వానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. ఇంకా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా పిస్తాపప్పు ఎంతో ఉపయోగపడుతుందని ఇందులో ఉండే విటమిన్ ఏ, ఇ వంటి పోషకాలు కంటిచూపును పెంచడంతో పాటు ఇతరత్రా కంటి వ్యాధులను కూడా దూరం చేస్తాయి. .

ఇంకా గుండె ఆరోగ్యానికి కూడా పిస్తాపప్పు చాలా మేలు చేస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. నేటి రోజుల్లో గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి పిస్తాపప్పు తినడం వల్ల ఇందులోని పోషకాలు గుండె జబ్బులను నివారించడంలో సహాయ పడతాయట. ఇంకా ఇవే కాకుండా పిస్తాపప్పు తినే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ అని నివేధికలు చెబుతున్నాయి. అంతే కాకుండా ఇందులో ఉండే ఫోలేట్, మాంగనీస్.. వంటి పోషకాలు జ్ఞాపకశక్తిని పెంచడంలో ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి డ్రైఫ్రూట్స్ లో ప్రత్యేక స్థానం ఉన్న పిస్తాపప్పును ప్రతిరోజూ తినడం అలవాటు చేసుకుంటే ఎంతో మేలు. అయితే పిస్తా అధికంగా తింటే కడుపు ఉబ్బరంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి మితంగా సేవిస్తూ ప్రతిరోజూ తింటే పుష్కలమైన లాభాలు శరీరానికి అందుతాయి.

Also Read:ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ‘మునగ లడ్డూ’!

- Advertisement -