విడుదలకు ముందు ఏంచెప్పారంటే..

212
Abhinandan Varthaman
- Advertisement -

అభినందన్.. ప్రస్తుతం ప్రతి ఒక్కరి నోట్లో నానుతున్న పేరిది. పాకిస్థాన్ యుద్ధ విమాన్ని తరుముతూ వెళ్లి కూల్చేయడం.. ఆ క్రమంలో పాక్ సైన్యానికి చిక్కడం తెలిసిందే. రెండు రోజుల ఉత్కంఠ అనంతరం భారత్‌లో అడుగుపెట్టిన అభినందన్‌ పాక్ ఆర్మీకి చిక్కే ముందు ఆయన తన దగ్గరున్న కీలక డాక్యుమెంట్లను నాశనం చేశారు.

పాక్ సైన్యం చెరలోనూ ఆయనెంతో ధైర్యంగా మాట్లాడి భారత సైన్యం ఎంత దృఢమైందో ప్రపంచానికి చాటారు. గాయాలపాలై శత్రు వలయంలో ఉన్నా మనో నిబ్బరంకోల్పోలేదు. బిడియాన్ని దరిచేరనివ్వలేదు. పాకిస్థాన్‌ అధికారులకు దీటుగా, తెలివిగా, గంభీర స్వరంతో బదులిచ్చారు. తన పేరు, సర్వీసు నంబరు, మతాన్ని వెల్లడించిన అభినందన్ మరిన్ని వివరాలు చెప్పడానికి నిరాకరించారు.

సారీ! నేనంతే చెప్పాలనుకున్నానంటూ సైనికాధికారులతో అన్నారు. పాకిస్థాన్‌ విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను కిందపడ్డ సమయంలో అక్కడ చాలా మంది జనం గుమికూడి ఉన్నారని, ఆ గందరళగోళంలో తన పిస్టల్‌ కింద పడిపోయినట్లు అభినందన్‌ తెలిపారు. నన్ను నేను రక్షించుకోవడానికి పరుగులు తీశానని, అల్లరి మూక తన వెంట పడినట్లు పేర్కొన్నారు.

వాళ్లు చాలా ఆవేశంలో ఉన్నారని, అదే సమయంలో ఇద్దరు పాకిస్తాన్‌ జవాన్లు వచ్చారని, వాళ్లే నన్ను మూక నుంచి రక్షించినట్లు అభినందన్‌ తెలిపారు. ఫస్ట్‌ ఎయిడ్‌ చేసి ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారని అన్నారు. నా విషయంలో పాకిస్తాన్‌ ఆర్మీ ప్రొఫెషనల్‌గా వ్యవహరించిందని అభినందన్‌ వెల్లడించారు.

- Advertisement -