‘పైల్స్’ కు చెక్ పెట్టండిలా!

88
- Advertisement -

నేటి రోజుల్లో చాలా మందిని వేదించే సమస్య పైల్స్. ముఖ్యంగా వయసు పైబడిన వారిలో అనగా 50-60 సంవత్సరాల వయసు పైబడిన వారిలోనే ఈ సమస్య అధికంగా వేదిస్తుంది. పాయువు దిగువ పురుషనాళంలో సిరాల వాపు పైల్స్ కు ప్రధాన కారణం. ఈ పైల్స్ సమస్య ఉన్న వారి బాధ వర్ణనాతీతం. మలద్వారంలో దురద, మంట, నొప్పి వంటి సమస్యలు తరచూ వేదిస్తూ ఉంటాయి. దీంతో పైల్స్ ఉన్నవారు సరిగా కూర్చోలేక, సరిగా నడవలేక ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. పాయువు వద్ద వాపు రావడం, పురుషనాళం నుంచి రక్తస్రావం, స్టూల్ పాస్ చేసేటప్పుడు తరచూ ఒత్తిడి కలగడం వంటివి దీని లక్షణాలుగా చెప్పుకోవచ్చు. .

ఇక ఈ పైల్స్ లో బాహ్య, అంతర్గతం అని రెండు రకాలుగా ఉంటాయి. ఇక ఈ పైల్స్ నుంచి ఉపశమనం పొందేందుకు ఆపరేషన్ ఒక్కటే ఉత్తమం అని చాలా మంది సర్జరీ వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే ఈ పైల్స్ సమస్య తీవ్రంగా లేనప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యకు ప్రారంభ దశలోనే చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా శరీరానికి తగినంత నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. రోజుకు కనీసం 4-5 లీటర్ల నీరు మన శరీరానికి అందించాలి. దాంతో రక్తప్రసరణ సాఫీగా జరిగి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. ఇక పైల్స్ దరిచేరకుండా ఉండాలంటే రోజు వ్యాయామం చేయడం ఎంతో ఉత్తమం.

పైల్స్ సమస్య ఉన్నవారు ఆహార డైట్ లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ముల్లంగి లో పైల్స్ కు చెక్ పెట్టె సామర్థ్యం అధికంగా ఉంటుంది. ముల్లంగిలో ఉండే రాప్నిన్, గ్లూకోసిలినేట్స్, విటమిన్ సి వంటి మెటబొలైట్ లు పైల్స్ తో వచ్చే వాపు, నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇక ముల్లంగిలో వోలటైల్ ఆయిల్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ ఫ్లామెంటరీ గుణాలను కలిగిఉండడం వల్ల మలద్వారాపు వాపును తగ్గిస్తుంది. పైల్స్ సమస్య ఉన్నవారు మలబద్దకాన్ని నివారించడం చాలా ముఖ్యం. ముల్లంగిలో ఉండే డైటరీ ఫైబర్ మలబద్దకాన్ని తగ్గించి ఈజీ మోషన్ కు సహకరిస్తుంది. కాబట్టి పైల్స్ సమస్య ఉన్నవారు ముల్లంగిని తినడం ఎంతో మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి పైల్స్ సమస్య ఉన్నవారు ముల్లంగిని నిర్లక్ష్యం చేయకండి.

Also Read;Tamanna:నా కల నెరవేరింది

- Advertisement -