పైల్స్…ఆయుర్వేద చికిత్స!

4
- Advertisement -

పైల్స్‌…నేటి రోజుల్లో చాలా మందిని వేధించే సమస్య. ముఖ్యంగా వయసు పైబడిన వారిలో అనగా 50-60 సంవత్సరాల వయసు పైబడిన వారిలోనే ఈ సమస్య కనిపిస్తోంది. మలద్వారంలో దురద, మంట, నొప్పి వంటి సమస్యలు తరచూ వేదిస్తూ ఉంటాయి. దీంతో పైల్స్ ఉన్నవారు సరిగా కూర్చోలేక, సరిగా నడవలేక ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు.

తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యకు ప్రారంభ దశలోనే చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా శరీరానికి తగినంత నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. రోజుకు కనీసం 4-5 లీటర్ల నీరు మన శరీరానికి అందించాలి. అలాగే ఆయుర్వేద చికిత్స ద్వారా పైల్స్‌ని అరికట్టవచ్చు.

పైల్స్​ను తగ్గించేందుకు శొంఠి ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. జీర్ణశక్తి మందగించడం వల్ల పైల్స్ సమస్య వస్తుందని.. అది మెరుగపడడానికి దీనిని వాడాలని సూచిస్తున్నారు. మిరియాలను అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తుంటారు. మిరియాలలో అజీర్తి సమస్యను తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇన్​ఫెక్షన్లు తగ్గడానికి, శరీరంలోని మలినాలు బయటకు వెళ్లడానికి ఔషధంగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

Also Read:ఏ ఆహారం ఎంతెంత తీసుకోవాలో తెలుసా?

- Advertisement -