ఎస్సీ ఎస్టీ, మైనారిటీల పట్ల కేంద్రం వివక్ష..

65
pidamarthi ravi

కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్ల ఎత్తివేత కుట్రను వ్యతిరేకిస్తూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మాదిగ జేఏసీ, బీసీ జనసభ, గిరిజన శక్తి సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి హాజరైయ్యారు. ఈ సమావేశంలో పిడమర్తి రవి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పట్ల వివక్ష చూపుతోందన్నారు. దేశంలో రిజర్వేషన్లు లేకుండా చేసే కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నామని రవి తెలిపారు.

కేంద్రం ఒక పక్క రైతులకు అన్యాయం చేస్తూనే.. దళిత, గిరిజన, మైనార్టీలు చదువుకోకుండా.. వారికి ఉన్నత ఉద్యోగాలు రాకుండా కుట్ర చేస్తోంది. కేంద్రం రిజర్వేషన్లు తీసేస్తే దేశవ్యాప్త రిజర్వేషన్ల అనుకూల ఉద్యమం చేపడతాం. వెనుకబాటు ఉన్నంత కాలం రిజర్వేషన్లు ఉండవని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పేర్కొన్నారు.