ఫేక్‌ న్యూస్‌కు చెక్‌..ఫిర్యాదుకు ప్రత్యేక వాట్సాప్ నెంబర్

124
fake news
- Advertisement -

దేశంలో ఫేక్ న్యూస్‌కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కఠిన చట్టాలు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా సోషల్ మీడియా సంస్థలకు కొత్త చట్టాలకు సంబంధించి విధివిధానాలను రూపొందించగా కేంద్రం తీసుకొచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం పనిచేస్తామని ఆయా సంస్థలు వెల్లడించాయి.

ఇందులో భాగంగా ప్రత్యేక వాట్సాప్ నెంబర్ తీసుకొచ్చింది కేంద్రం. కరోనా కేంద్రంగా దుష్ప్రచారాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులకు కొత్త పథకాలు ప్రకటించాయంటూ సోషల్‌మీడియాలో అవాస్తవాలను గుర్తిస్తే 8799711259కు వాట్సాప్‌ చేయాలని లేదా @PIB Fact checkకి ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదుచేయాలని కేంద్ర హోంశాఖ సూచించింది. ఫేక్‌న్యూస్‌ను గుర్తిస్తే ఇతరులకు ఫార్వర్డ్‌ చేయకుండా సైబర్‌క్రైం పోర్టల్‌కు ఫిర్యాదుచేయాలని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

- Advertisement -