సినీ,రాజకీయం ఏరంగంలో ఉన్న సరే గాసిప్స్ పుట్టుకురావడం సహజమే. కొంతమందికి గాసిప్స్ వినడంపై ఆసక్తి ఉంటే మరికొంతమందికి ఆ గాసిప్స్‌ను పుట్టించడం,ప్రచారం చేయడం అలవాటు. ఇకపై ఇలాంటి వారికి కొంతకష్టమే. గాసిప్స్ ప్రచారం చేస్తే చెత్త ఎత్తాల్సిందే. శిక్ష అనుభవించాల్సిందే.ఫిలిప్పిన్స్‌లో తీసుకొచ్చిన ఈ విధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నిజం చెప్పులు వేసుకునే లోగా అబద్దం ప్రపంచాన్ని చుట్టేస్తుందని తెలిసిందే. కొందరికి పుకార్లు వినోదాత్మకంగా అనిపించినా మరికొంతమందికి ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇక స్మార్ట్ ఫోన్ రాకతో అరచేతిలో ప్రపంచంలో ఏమూలన ఏం జరిగిన ఇట్టే తెలిసిపోతోంది. ఈ నేపథ్యంలో గాసిప్స్ వార్తలకు పుల్ స్టాప్ పెట్టేందుకు ఫిలిప్పిన్‌లోని ఓ పట్టణం అడుగులేసింది.
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకి 200 కిలో మీటర్ల దూరంలో ఉన్న చిన్న పట్టణం బినలొనన్. గతంలో అక్కడ విపరీతంగా పుకార్లు సృష్టించేవారట. దీంతో వీటిని ఎలాగైన అరికట్టాలని భావించిన స్థానిక ప్రభుత్వం ఏకంగా పుకార్లను నిషేధిస్తూ ఓ చట్టం తీసుకొచ్చింది. ఎవరైనా పుకార్లు సృష్టించినా వాటిని ప్రచారం చేసినా నేరంలా పరిగణిస్తారు.
తొలిసారి అయితే 264 రూపాయల జరిమానా విధిస్తారు. అంతే కాదు తప్పనిసరిగా మూడు గంటల పాటు వీధుల్లో చెత్త సేకరించేలా శిక్ష విధిస్తారు. ఇక ఒక్కటి కంటే ఎక్కువ సార్లు పుకార్లు పుట్టిస్తూ పట్టుబడితే 20 డాలర్లు జరిమానా విధించి 8 గంటలు సమాజ సేవ చేసేలా చూస్తారట. మొత్తంగా ఫిలిప్పిన్స్‌లో అమలవుతున్న ఈ వింత చట్టం గురించి తెలుసుకుని అంతా విస్తుపోతున్నారు.