ఫార్మాసిస్ట్ పోస్టులకు జాబ్ మేళా

1
- Advertisement -

ఉస్మానియా యూనివర్సిటీ లోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీ ఆధ్వర్యంలో ఈ నెల 28 న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు.

అపోలో ఫార్మసీ లోని ఫార్మాసిస్టు, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ లకు చెందిన 100 పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. డీ ఫారసీ, బీ ఫార్మసీ, ఎం.ఫార్మసీ, డిగ్రీ చేసిన 18 నుండి 35 సంవత్సరాల వయసు వారికి మాత్రమే ఈ జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (UEI &GB/MCC)ఒక ప్రకటనలో తెలియజేసింది.

రూ.11,000 నుండి రూ.25,000 వేలవరకు వేతనం ఉండే ఈ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు మరిన్ని వివరాలకు టి. రఘుపతి, HR (Ph.No.82476 56356) ను సంప్రదించాలని ఆ ప్రకటనలో కోరారు. విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ తో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో,(UEI&GB /MCC )వద్ద నేరుగా మార్చ్ 28న హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు.

Also Read:‘రాబిన్‌హుడ్‌’..టికెట్ ధరల పెంపు

- Advertisement -