యూపీఐ యాప్స్‌తో పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా!

4
- Advertisement -

అవును మీరు చదువుతుంది నిజమే. ఇకపై యూపీఐ యాప్స్‌ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి వాటితో ఇకపై పీఎఫ్‌ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.

ఇందుకోసం నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఈపీఎఫ్‌ఓ చర్చలు జరుపుతోంది. వచ్చే 2-3 నెలల్లో ఈ సదుపాయాన్ని ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈపీఎఫ్‌ఓ ప్రణాళిక సిద్ధం చేసింది.

ఇప్పటివరకు ఈపీఎఫ్‌ఓ ఖాతాదారుల క్లెయిమ్‌ సెటిల్‌ అయిన తర్వాత బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యేవి. అయితే, దీనికి రెండు మూడు రోజులు పట్టేది. మధ్యలో బ్యాంకు సెలవులు వస్తే, ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేది. అయితే, కొత్త విధానం అందుబాటులోకి వస్తే ఫోన్‌ పే, జీపే, పేటీఎం వంటి యూపీఐ ప్లాట్‌ ఫామ్‌ ల ఐడీకే పీఎఫ్‌ సొమ్ము వస్తుంది. దీంతో క్లెయిమ్‌ సెటిల్‌ అయిన క్షణాల్లోనే ఖాతాదారులకు డబ్బులు జమ అవుతాయి.

Also Read:అటెండర్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా!

- Advertisement -