పెరిగిన పెట్రోల్,డీజీల్ ధరలు..

83
petrol

వాహన కొనుగోలుదారులకు షాక్. పెట్రోల్,డీజీల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రేటు 22 పైసలు పెరిగి రూ.105.48కు చేరగా డీజిల్ రేటు 28 పైసలు పెరిగి రూ.97.74కు చేరింది. ఏపీలో పెట్రోల్ ధర 21 పైసలు పెరుగుదలతో రూ.107.31కు చేరగా డీజిల్ రేటు 26 పైసలు పెరుగుదలతో రూ.99.07కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.28 శాతం పెరుగుదలతో 78.94 డాలర్లకు చేరగా డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.36 శాతం పెరుగుదలతో 75.72 డాలర్లకు చేరింది.