- Advertisement -
పెట్రోల్,డీజీల్ ధరల పెంపు ఆగడం లేదు. వరుసగా 14వ రోజు చమురు ధరలు పెరిగాయి. రోజువారి సమీక్షలో భాగంగా లీటర్ పెట్రోల్‌పై మరో 90 పైసలు, డీజిల్‌పై 87 పైసల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి చమురు కంపెనీలు. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49కి, డీజిల్ రూ.105.49కి చేరాయి.
ఢిల్లీలో లీటరుకు 80 పైసల చొప్పన పెరగడంతో పెట్రోల్ రూ.105.41, డీజిల్ రూ.96.67కు పెరిగాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌పై 84 పైసలు పెరగడంతో రూ.120.51కి, డీజిల్‌పై 85 పైసలు వడ్డించడంతో రూ.104.77కు చేరాయి.
- Advertisement -