ఆగని పెట్రోమంట..

80
petrol

పెట్రోల్ ధరల పెరుగుదలకు బ్రేక్ పడేలా కనిపించడం లేదు. గత వారం రోజులుగా పెట్రోల్,డీజీల్ ధరలను పెంచుతున్న చమురు కంపెనీలు తాజాగా ఇవాళ కూడా వినియోగదారులకు షాకిచ్చాయి. లీటరు పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు వడ్డించాయి.

దీంతో దేశ రాజధాని ఢిల్లీలోలో చమురు ధరలు ఆల్‌టైం హైకి చేరాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.104.44కు చేరగా, డీజిల్‌ రూ.93.17కు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ 31 పైసలు, డీజిల్‌ 38 పైసల చొప్పున పెరుగగా పెట్రోల్‌ ధర రూ.108.64కు చేరగా, డీజిల్‌ ధర రూ.101.65కు చేరింది. ముంబైలో పెట్రోల్‌ రూ.110.41, డీజిల్‌ రూ.101.03కు చేరాయి.