- Advertisement -
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రో ధరలతో వినియోగదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. వరుసగా 20వ రోజు పెట్రో ధరలు భగ్గుమన్నాయి. లీటర్ పెట్రోల్ పై 21 పైసలు,డీజిల్‌పై 17 పైసలు పెరిగింది.
దీంతో హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 82.96, డీజిల్ ధర రూ.78.19పైసలుగా ఉండగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 79.92 పైసలు, డీజిల్ ధర 80.02, చెన్నైలో పెట్రోల్ రూ. 83.18, డీజిల్ ధర రూ.77.29గా ఉంది.
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ. 86.70, డీజిల్ ధర రూ.78.34 పైసలుగా ఉండగా 20రోజుల్లో పెట్రోల్ లీటర్‌కు రూ.8.93పైసలు, డీజిల్ లీటర్‌కు రూ.10.07పైసలు పెరిగింది. మరోవైపు పెరుగుతున్న పెట్రోల్ ధరలతో మోడీ సర్కార్‌పై ప్రతిపక్షాలు, సామాన్య ప్రజలు మండిపడుతున్నారు.
- Advertisement -