- Advertisement -
దేశంలో వరుసగా 19వ రోజు పెట్రో ధరలు భగ్గుమన్నాయి. రోజువారి సమీక్షలో భాగంగా నిన్న పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు చేయని చమురు కంపెనీలు ఇవాళ మాత్రం పెట్రోల్ పై 16 పైసలు,డీజిల్ పై 14 పెంచాయి. దీంతో వినిమోగదారులపై మరింత భారం పడనుంది
దేశ రాజధాని ఢిల్లీలో మొదటిసారిగా డీజిల్ ధరలు రూ.80 మార్కుని దాటాయి. ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.80.02కి చేరగా, పెట్రోల్ ధర రూ.79.92కి పెరింగింది.
చరిత్రలో మొదటి సారిగా పెట్రోల్ కంటే డీజిల్ ధరలు పెరిగాయి. వరుసగా రెండో రోజు కూడా పెట్రోల్ కంటే డీజిల్ ధర 10 పైసలు అధికంగా ఉంది. 19 రోజుల్లో పెట్రోల్ ధర రూ. 9కి పైగా పెరగగా డీజిల్ ధర ఏకంగా రూ.10 దాటేసింది.
- Advertisement -