రూ.90 దాటిన పెట్రోల్‌ ధర..

259
- Advertisement -

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలనంటుతున్నాయి. సామాన్యుడిపై గుదిబండలా మారాయి పెట్రోల్ ధరలు. రోజు రోజుకూ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. దీంతో సామాన్యుడు ప్రజారవాణా వ్యవస్థను ఆశ్రయిస్తున్నాడు. తాజాగా ఇంధనం ధరలు పెరిగాయి. సోమవారం కూడా ధరల పెంపు కొనసాగింది. వాణిజ్య రాజధాని నగరమైన ముంబయిలో పెట్రోల్‌ ధర తొలిసారి రూ.90 దాటింది. ముంబయిలో ఆదివారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.89.97 పైసలు ఉండగా సోమవారం ఉదయానికి 11 పైసలు పెరిగి రూ.90.08కి చేరింది. ఇక డీజిల్‌ ధర ఇక్కడ రూ.78.58గా ఉంది.

Petrol price

ఇక దేశంలోనే అత్యధికంగా పట్నాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.96గా ఉండగా.. డీజిల్‌ ధర రూ.79.68గా నమోదైంది. దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.82.72 పైసలు ఉండగా.. డీజిల్‌ ధర రూ.74.02గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.84.54గా ఉండగా డీజిల్‌ ధర రూ.75.97గా నమోదైంది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ. 87.70గా ఉండగా.. డీజిల్‌ ధర రూ.80.51కి చేరింది. గత ఐదు నెలల్లో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.4.66 పెరగగా.. డీజిల్‌ ధర రూ.రూ.6.35 పెరిగింది.

- Advertisement -