రూ.30 కంటే తక్కువకే పెట్రోల్ !

215
Petrol may cost less than Rs 30
Petrol may cost less than Rs 30
- Advertisement -

పెట్రోల్‌ను మీరు కేవలం రూ.30కి, అంతకంటే తక్కువకు కొనుగోలు చేయవచ్చు. రూపాయి తగ్గితే రూ.2 పెరుగుతుంది పెట్రోల్. అలాంటిది సగాని కంటే తక్కువగా పెట్రోల్ వస్తుందా? అంటే రానున్న కాలంలో అది వాస్తవ రూపం దాల్చుతుందంటున్నారు.

వచ్చే ఐదేండ్లలో లీటరు పెట్రోల్ ధర రూ.30 స్థాయికి తగ్గవచ్చని టోనీ సెబా అనే వ్యక్తి అంచనా వేస్తున్నారు. ఆటో ఇండస్ట్రీలో ఆధునిక టెక్నాలజీ పుణ్యమాని భవిష్యత్‌లో పెట్రోల్‌పై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గొచ్చని, దాంతో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు భారీగా పడిపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి చెందిన పారిశ్రామికవేత్త అయిన టోనీ సెబా.. సోలార్ రంగం భారీగా అభివృద్ధి చెందనుందని చాలా ఏండ్లక్రితమే జోస్యం చెప్పారు. అప్పట్లో సోలార్ విద్యుత్ రేటు ప్రస్తుత స్థాయితో పోలిస్తే 10 రెట్లు అధికంగా ఉండేది.

electric-cars

గతంలో సోలార్ పవర్‌పై సెబా చెప్పింది అక్షరాలా నిజమైంది. కాబట్టి ఆయిల్ ధరల విషయంలోనూ కచ్చితంగా అదే జరిగి తీరుతుందంటున్నారు. భవిష్యత్‌లో సోలార్ విద్యుతే ఇంధనమని ఆయన అన్న మాటలు కూడా నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. స్వయంచోదిత (సెల్ఫ్ డ్రైవింగ్) ఎలక్ట్రిక్ కార్ల కారణంగా ముడిచమురు డిమాండ్ భారీగా తగ్గి పీపా ధర 25 డాలర్లకు పడిపోవచ్చని సెబా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 53 డాలర్ల స్థాయిలో ఉంది. సెబా అంచనాల ప్రకారం 2021-2020 మధ్య ఆయిల్ డిమాండ్ బాగా తగ్గిపోతుందని, 100 మిలియన్ బ్యారెల్స్ కాస్తా, 70 మిలియన్ బ్యారెల్స్‌కు చేరుకుంటుందని అంచనా. దీనివల్ల బ్యారెల్ చమురు ధర 25 డాలర్లకు పడిపోతుందని అంచనా వేశారు.

2030 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెద్ద ఎత్తున పెరుగుతుందని ఇటీవల కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అంటే మరో పదిహేనేళ్ల తర్వాత దేశంలో ఒక్క పెట్రోలు, డీజిల్ వాహనం కూడా కొనుగోలు కాదని అంచనా వేశారు. సెబా అంచనాల ప్రకారం ఐదేండ్లలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేటు సగానికంటే తగ్గితే.. దేశీయ మార్కెట్లోనూ పెట్రోల్, డీజిల్ రేట్లు అందుకు అనుగుణంగా తగ్గే అవకాశం ఉంది.

- Advertisement -