ఏ క్షణమైన పెట్రోబాంబ్‌!

152
petrol
- Advertisement -

దేశంలో ఏక్షణంలోనైనా పెట్రోల్,డీజీల్ ధరల పెంపుపై వార్త వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతుండడంతో పెట్రో మంట రేగడం ఖాయంగా కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ పై లీటర్‌కు 10 నుంచి 15 రూపాయల వరకు పెరగొచ్చని అంచనాలున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 81.5 డాలర్లుగా ఉండగా మార్చి 1 నాటికి 111 డాలర్లకు చేరింది. ఇప్పుడు 125 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. ధరలు భారీగా పెరగడంతో ఏర్పడిన నష్టాలను పూడ్చుకునేందుకు రిటైల్‌గా ధరలను అదే స్థాయిలో పెంచేందుకు ఆయిల్ కంపెనీలు సిద్ధమయ్యాయి.

పెట్రోల్ ధరలు ప్రపంచ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయన్నారు…. ఎన్నికల కోసమే ధరలు పెంచకుండా ఆపారన్న ప్రతిపక్షాల విమర్శలు కొంతవరకు నిజమే కావొచ్చన్నారు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పురి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

- Advertisement -