బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా పూర్తయింది. ఇక ఈ సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలవగా షో ముగిసిన అనంతరం జరిగిన దాడి ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో పై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కు హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే అనంతరం అన్నపూర్ణ స్టూడియో ఎదుట జరిగిన దాడిని ప్రస్తావిస్తూ.. బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని చెప్పారు.
ఈ ఘటనపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారని.. ఇందులో నాగార్జున పేరు ఎక్కడ లేదని.. నాగార్జునను కూడా బాధ్యుడ్ని చేయాలని న్యాయవాది అరుణ్ విజ్ఞప్తి చేశారు. ఈ దాడి వలన 6 ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసం అయ్యాయని.. నాగార్జునపైనా కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. మరోవైపు పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Also Read:ఆ సినీ రచయిత మాట నేటికీ గొప్పదే