హైడ్రా రద్దుపై హైకోర్టు కీలక కామెంట్!

4
- Advertisement -

హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు లక్ష్మీ అనే మహిళ . హైడ్రా ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ..హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 99ను రద్దు చేయాలని కోరారు పిటీషనర్.

జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం జీహెచ్ఎంసీకి ఉన్న అధికారులను మరొక అథారిటీకి ఇవ్వకూడదు కానీ ప్రభుత్వం జీహెచ్ఎంసీ అధికారులను హైడ్రాకు ఇచ్చిందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే జీహెచ్ఎంసీకి ఉన్న విచక్షణ అధికారులను హైడ్రాకు ఇవ్వటం సరికాదు అని వెల్లడించారు లక్ష్మీ.

జీవో 99 ప్రకారం హైడ్రాకు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి లేదా ప్రభుత్వ కార్యదర్శి అధికారిగా ఉండాలని కానీ ప్రస్తుతం హైడ్రాకు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి కాకుండా ఉన్న వ్యక్తిని నియమించారన్నారు. పిటిషనర్ వాదనలు విన్న న్యాయస్థానం..కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.

Also Read:Supreme Court: కేజ్రీవాల్‌కు బెయిల్…కండీషన్స్ ఇవే

- Advertisement -