పండుగలు మన ఆచార వ్యవహారాలు. మన ఆచారాలను సజీవంగా నిలుపుతూ భావితరాలకు అందించే మహాత్తర సంస్కృతి. ఏ పండగైనా అందరికీ ఆనందాన్ని కలిగించడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ ఆచార వ్యవహారాలను కొనసాగించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక హోలీ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. హోలీని ప్రతీయేటా చతుర్దశి నాడు కాముని దహనం అనంతరం పాల్గుణ పౌర్ణమి నాడు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
ఆడ,మగ అనే తేడా లేకుండా అందరూ హోలీ సంబరాల్లో పాల్గొంటారు. అట్లాంటి హోలీ పండుగను ఢిల్లీలోని కొందరు యువకులు అప్రతిష్ట తెచ్చేవిధంగా వికృత చేష్టలతో భయాందోళనకు గురిచేశారు. రంగులతో జరుపుకోవాల్సిన హోలీ పండుగను.. వీర్యంతో మలినం చేశారు.
గాలి బుడగల్లో వీర్యాన్ని నింపి.. అమ్మాయిలపై విసిరేశారు.ఢిల్లీలోని అమర్ కాలనీ మార్కెట్‌లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మార్కెట్ నుంచి వెళుతున్న కొంతమంది అమ్మాయిలను ఫాలో అయిన యువకలు వారిపై వీర్యాన్ని నింపిన గాలి బుడగలను విసిరేశారు. యువకుల వికృత చేష్టలపై యువతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోలీ పండుగ సందర్భంగా ఢిల్లీలోని లేడిస్ హాస్టళ్ల వద్ద భద్రత పెంచాలని అమ్మాయిలు డిమాండ్ చేస్తున్నారు.