ఆసీస్…326 ఆలౌట్

215
india vs australia
- Advertisement -

పెర్త్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండోటెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 326 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌ నైట్ స్కోరు 277/6తో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్‌ మరో 41 పరుగులు జోడించి మిగితా నాలుగు వికెట్లు కొల్పోయింది. భారత బౌలర్లలో ఇషాంత్ 4,బుమ్రా,ఉమేష్,విహారి తలో 2 వికెట్లు తీశారు.

టీమ్ పైన్ 38,ట్రావిస్ హెడ్ 19 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టారు. అంతకముందు తొలిరోజు టాస్ గెలిచిన ఆసీస్‌ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. తొలిసెషన్‌లో వికెట్‌ పడకుండా ధాటిగా ఆడిన ఆసీస్ ఓపెనర్లు సెకండ్ సెషన్‌లో మాత్రం తడబడ్డారు. హారిస్‌ (70; 141 బంతుల్లో 10×4), ఫించ్‌ (50; 105 బంతుల్లో 6×4) రాణించారు.

అయితే సెకండ్ సెషన్‌లో వెంటవెంటనే నాలుగు వికెట్లు కొల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమకంలో ట్రావిస్‌ హెడ్‌ (58; 80 బంతుల్లో 6×4), షాన్‌ మార్ష్‌ (45; 98 బంతుల్లో 6×4) రాణించారు. దీంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. తొలిరోజు ఇషాంత్‌ బౌలింగ్‌లో హ్యాండ్స్‌కాంబ్ కొట్టిన షాట్‌ను ఒంటి చేత్తో అందుకున్న కోహ్లి టాక్‌ ఆఫ్‌ ది డేగా మిగిలాడు.

- Advertisement -