- Advertisement -
కరోనా కారణంతో శాశ్వతంగా లాక్ డౌన్‌లో ఉండలేమన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. కరోనా విజృంభిస్తున్న మాట నిజమే కానీ దానితో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కరోనాను ఎదుర్కోవడంలో ఢిల్లీ ప్రభుత్వం ముందువరుసలో ఉందని తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన కరోనా పేషెంట్లలో కేవలం 2100 మంది మాత్రమే హాస్పిటళ్లలో ఉన్నట్లు వెల్లడించారు.
ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఎందుకంటే కరోనా బాధితులు చాలావరకు ఇంటివద్దే కొలుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతం కరోనా బాధితుల కోసం 6500 బెడ్స్ అందుబాటులో ఉన్నాయని మరో 9500 మంచాలు వారంలోగా రెఢీకానున్నట్లు తెలిపారు.
- Advertisement -