ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన దగ్గరనుండి త్వరగా కోలుకోవాలని ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు, అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి ఆకాంక్షలు ప్రార్ధనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం గుడి మసీదు చర్చీలు తదితర పుణ్యక్షేత్రాలలో సిఎం కెసిఆర్ ఆరోగ్య క్షేమాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజా కార్యాక్రమాలు నిర్వహించారు.
రాజకీయ సినిమా రంగానికి చెందిన ప్రముఖులు సిఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలని ట్వీట్లు, ప్రకటనలు చేశారు.సిఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని…. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీటర్ వేదికగా కోరుకున్నారు. సిఎం తర్వగా కోలుకోవాలని మాజీ మంత్రి కాంగ్రేస్ పార్టీ సీనియర్ నేత డా. జె. గీతారెడ్డి తన ట్విట్టర్ వేదికగా కోరుకున్నారు. బిజెపి సీనియర్ నేతలు పి.మురళీధర్ రావు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి సిఎం త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.ప్రముఖ నటుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ….‘‘సిఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్ధిస్తున్నాను..’’ అంటూ ప్రకటించారు.
‘‘కేసీఆర్ గారు గొప్ప ఫైటర్..తను త్వరలోనే ఆరోగ్యంగా తిరిగివస్తారు…తన కోసం మనం ప్రార్థనలు చేద్దాం’’ అంటూ ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.‘‘ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే సిఎం కెసిఆర్ ను కరోనా ఏమీ చేయలేదు..నిండు నూరేల్లు ఆరోగ్యంగా వుండాలని షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను’’ అంటూ..సిని నటుడు మోహన్ బాబు ప్రకటించారు.సిఎం కెసిఆర్ కరోనా బారినుండి తర్వగా కోలుకోవాలని కోరుకుంటూ….ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, డైరక్టర్ అడవి శేష్, నటుడు శార్వానంద్, నిర్మాత బిఎ రాజు లు కోరుకున్నారు.సిఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని హోం శాఖ మంత్రి మహమూద్ అలి నాంపల్లిలోని దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అర్చనలు చేయాలని అర్చకులను కోరారు. టిఆర్ఎస్ పార్టీ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత ట్విటర్ ద్వారా ప్రార్ధించారు.సిఎం కేసీఆర్ కోలుకోవాలంటూ ఎమ్మెల్సీ శేరీ సుభాష్ రెడ్డి ఏడుపాయల దుర్గామాత గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. సిఎం గారు త్వరగా కోలుకోవాలంటూ టిఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఆజ్మీరా రేఖానాయక్,పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రార్ధించారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే రవిశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాట్స్ చైర్మ్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి టిఆరెస్ నేత కిశోర్ గౌడ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మెంబర్ రాఘవ లు బషీర్ బాగ్ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో అర్చకులు సిబ్బంది కలిసి సుదర్శన హోమం నిర్వహించారు. ఝరాసంగం దత్తగిరి ఆశ్రమంలో మహామృత్యుంజయ హోమం నిర్వహించారు. సిఎం కెసిఆర్ కోలువాలంటూ పలువురు ఫాస్టర్లు చర్చీలల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.