రాష్ట్రంలో ఆధార్ అప్‌డేట్‌కు తిప్పలు తప్పట్లేదు. ప్రస్తుతం ఆధార్ కార్డు అన్ని పనులకు ఆధారమైంది. ఆధార్ లేకపోతే ఏ పనులు ముందుకు సాగవు ప్రభుత్వ పథకాలు అందాలన్నా కూడా ఆధార్ ముఖ్యం.బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనా పాన్ కార్డు కావాలన్నా ఇతరత్రా మనిషి మనుగడకు సంక్షేమానికి ఆధారం ముఖ్యం.
ఆధార్ కార్డులో వివరాలు సరిగ్గా లేకుంటే ఆధార్ కేంద్రానికి వెళ్లి అప్డేట్ చేసుకుంటాం కానీ ఈ రోజుల్లో ఆధార్ కార్డు అప్డేట్ కోసం నెలలు తరబడిగా రోజులు తరబడిగా మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు ప్రజలు.తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి కూడా ఆధార్ సవరణ చేసుకుంటున్నారు. జనాలు అధిక సంఖ్యలో పోటెత్తడం వల్ల ఆధార్ టోకెన్స్ కూడా లిమిటెడ్ గా ఇవ్వడం సవరణకు రోజు కొన్ని టోకెన్ లోకి మాత్రమే చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఐదారు రాష్ట్రాల నుండి ఆధార్ రీజినల్ సెంటర్కు పోటెత్తుతున్నారు.
నగరంలో మీ సేవ కేంద్రాలకు వేరే సంఖ్యలో జనాలు వస్తున్నారు.చత్తీస్‌గఢ్ ఒరిస్సా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఐదు రాష్ట్రాలకు సంబంధించిన వారు వస్తున్నారు. ఆధార్ లో పుట్టిన తేదీ పేరు సవరణ అడ్రస్ మార్పిడి కోసం జనాలు ఇక్కట్లు పడుతున్నారు.ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి మూడుసార్లు లిమిటేషన్ ఉంటుంది. డేట్ అఫ్ బర్త్ నేమ్ రెండుసార్లు మించి సవరణ చేయరాదు మూడోసారి చేసేటప్పుడు కొంచెం సమయం పడే అవకాశం ఉంటుంది లిమిట్ క్రాస్ అవుతుంది.రోజుకు అధిక సంఖ్యలో మీ సేవ కేంద్రానికి జనాలు అధిక రావడంతో కిక్కిరిసిపోతున్నాయి మీ సేవలు.
పూర్తిస్థాయిలో టోకెన్ ఇవ్వక ఇబ్బంది పడుతున్న జనాలు రాష్ట్రం నుండి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆధార్ సేవల కోసం అప్డేట్ కోసం వస్తున్నారు కానీ అయినా ఇప్పటికీ ఇలాంటి టోకెన్ దొరక నిరాశతో వెళ్లిపోతున్నారు జనాలు. ఇప్పటికైనా ఇలాంటివి పునరుద్ధరణ కాకుండా చూడాలని జనాలు అధికారులు ప్రాధేయపడుతున్నారు.
Also Read:ప్రతీ పనికి 20శాతం కమీషన్లు?:బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

