పెద్ద నోట్లు రద్దు..ఏటీఎంకు అంత్యక్రియలు..!

254
People in Kannur ‘mourn sudden death’ of an ATM,
- Advertisement -

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రజానీకాన్ని పరుగులు తీయిస్తోంది.దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు ధనిక, వ్యాపార, ఉద్యోగ వర్గాలు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. సినిమా హాళ్లు, హోటళ్లు, చికెన్, మటన్ సెంటర్లు, చిల్లర దుకాణాలు, సూపర్ మార్కెట్లు వెలవెలబోతున్నాయి. చాలా పట్టణా ల్లో దళారులు రంగప్రవేశం చేసి కమీషన్ల వ్యాపారానికి తెరలేపారు. రూ.500కి రూ.400, రూ.1000కి రూ.800 చొప్పున చెల్లింపులు జరి పారు. పెద్ద నోట్లను ఏదో విధంగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్చుకుంటామనే భరోసా ఉన్న వ్యాపారు లు, కమీషన్ ఏజెంట్లు, కుదువ వ్యాపారులు నోట్లు తీసుకున్నారు. పుణ్యక్షేత్రాలైన తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, నారాయణవనం, అప్పలాయగుంట, శ్రీనివాస మంగాపురంలో బుధవారం భక్తుల తాకిడి తగ్గింది.

మరోవైపు ప్రభుత్వం సరిపడా ఏర్పాట్లు చేయకపోవడంతో ఇప్పటికి ఏటీఎంల ముందు జనం బారులు తీరాల్సివస్తోంది. క్యూలైన్లలో నిలబడి మరణించే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతు వస్తోంది. దీంతో ప్రజలు మోడీ సర్కార్‌పై అసహనంతో రగిలిపోతున్నారు. 20 శాతం ధనిక వర్గాల కోసం 80 మంది పేదలు ఇబ్బందులు పడాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. మోడీ తీసుకున్న నిర్ణయంతో నల్లధనం ఏవిధంగా బయటికి వస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

People in Kannur ‘mourn sudden death’ of an ATM,

మరోవైపు నోట్లు తీసుకునేందుకు వ్యాపారులు గంటల తరబడి క్యూ లైన్ లో వేచియున్నా లాభం లేకపోవడంతో విచిత్రమైన పంథాలో తమ అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు పలువురు. ఢిల్లీలోని ఓ ఏటీఎం ఎదుట నిలుచున్న ఓ యువతి తీవ్ర అసహనంతో.. క్యూలోనే టాప్ లెస్ గా మారిపోయిన విచిత్ర సంఘటన మరిచిపోకముందే.. కేరళలో మరో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.

People in Kannur ‘mourn sudden death’ of an ATM,

గంటల తరబడి క్యూ లైన్ లో వేచియున్నా డబ్బు దొరక్కపోవడంతో.. విచిత్రమైన రీతిలో తమ నిరసనను వ్యక్తపరిచారు అక్కడి స్థానికులు. చావు సందర్బంగా వినిపించే శోకాలను తలపించేలా.. ‘ఇంత త్వరగా మమ్మల్ని వదిలిపోయినందుకు విచారిస్తున్నామని, మోడీ జపాన్ పర్యటనలో ఉన్నందునా… రాగానే అంత్యక్రియలు నిర్వహిస్తామని’ ఓ కాగితంలో పేర్కొంటూ దాన్ని ఏటీఎంకు అంటించారు. ఆపై ఏటీఎంకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేరళ వాసులు చేసిన ఈ విచిత్రమైన నిరసన ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -