యుఎస్ వేదికగా జరుగుతున్న తానా మహాసభల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జైల్లో కూర్చొని వచ్చిన వాళ్లు ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నప్పుడు ఏ తప్పూ చేయని, సత్యం మాట్లాడే తాను ఎందుకు బాధపడాలని పరోక్షంగా వైసీపీ టార్గెట్ చేశారు పవన్.
ఓట్లకు నోట్లు ఇచ్చి గెలిచిన పార్టీలు అధికారాన్ని పొందుతున్నాయని ఆ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల్లో ఓటమి స్పందించిన పవన్ డబ్బులిచ్చి ఓట్లు సంపాదించి గెలవడం కంటే డబ్బులు ఇవ్వకుండా ఓట్లు రాకుండా ఓడిపోయినా ఆ అపజయాన్ని తాను సంతోషంగా స్వీకరిస్తానని అన్నారు.
మనుషుల్ని విడగొట్టి రాజకీయాలు చేయనని స్పష్టం చేశారు. మనుషుల్ని కలిపే రాజకీయాల్లో ఉంటానని… ఇలాంటి రాజకీయాల వల్ల దేశం విచ్ఛిన్నమవుతుందన్నారు. అపజయం తనకు మరింత బలాన్ని ఇచ్చిందన్నారు. బల్బుని కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్‌లా ఎన్ని అపజయాలు ఎదురైనా పోరాడతానన్నారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో ఎంతో ఆలోచించి జనసేన పార్టీ పెట్టానన్నారు.