Revanth Reddy: ప్రజా సంక్షేమమే మా ధ్యేయం

6
- Advertisement -

ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలోని ప్రతి కుటుంబానికి సంతోషం అందించడమే లక్ష్యం అని తేల్చిచెప్పారు. గొల్కోండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు రేవంత్.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ పీవీ నరసింహరావు అన్నారు. ఆర్థిక సంస్కరణలను తీసుకుచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవల ఫలితంగా అద్భుత ప్రగతి సాధించామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో సోనియా గాంధీ పాత్రను మరువలేమన్నారు.

నిజమైన స్వాతంత్య్ర స్ఫూర్తిని పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామని పారదర్శకమైన పాలనను ప్రజలకు అందిస్తున్నామన్నారు. నెహ్రూ ప్రారంభించిన ప్రాజెక్టులతోనే దేశం సస్యశ్యామలంగా ఉందన్నారు. బీహెచ్‌ఈఎల్‌, మిధాని వంటి పరిశ్రమలను స్థాపించిందన్నారు.

Also Read:Modi: 2047 నాటికి వికసిత్ భారతే లక్ష్యం

- Advertisement -