10న ఎస్సారెస్పీ పునరుజ్జీవన ప్రాజెక్టు శంకుస్థాపన

207
Pending projects will be completed shortly
- Advertisement -

పెండింగ్ ప్రాజెక్టులను సీఎం కేసీఆర్ శరవేగంగా పూర్తి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్  ఈ నెల 10న ఎస్సారెస్పీ పునర్‌జీవన ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఉదయం 11 గంటలకు పోచంపాడ్ దగ్గర శంకుస్థాపన జరిగిన అనంతరం..మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

మిషన్ కాకతీయ  మంచి ఫలితాలు అందిస్తోందన్నారు. ఎస్ఆర్ఎస్పీలో ఒకప్పుడు నీళ్లు లేక మొసళ్లు బయటకు వచ్చేవని.. అలాంటి పరిస్థితుల్లో తమ ప్రభుత్వం ప్రాజెక్టులకు జల కళ తీసుకొచ్చిందన్నారు. 112 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రారంభించిన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్… 80 టీఎంసీలకు పడిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవన, ఆధునీకరణలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ ప్రాజెక్టులకు చెరో రూ.2000 కోట్లు కేటాయించామన్నారు.

నీళ్లు లేక కాలువలను దున్ని… పొలాలుగా మార్చేశారని… దాన్ని పునురుద్దరించనున్నామన్నారు.  ధవళేశ్వరం, సుంకేశుల వంటి ఆంధ్రప్రాంతంలోని ఆనకట్టలను ఆనాడు  ఆధునీకరించుకున్నారని… తెలంగాణలోని సదర్ మట్ ను మర్చిపోయారని అని ఆరోపించారు.

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.7 వేల కోట్లు చెల్లించామన్నారు. రైతులకు ఏడాదికి రూ.8 వేలు పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. రూ.1024 కోట్లతో ప్రతీ మండల కేంద్రంలో గోదాము ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -