అనీషా దామ, ప్రిన్స్, భావన వజపండల్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘పెళ్లికూతురు పార్టీ’. పృథ్వీ క్రియేషన్స్ బ్యానర్‌పై అపర్ణ మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎ.వి.ఆర్.స్వామి నిర్మాత. శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. పాన్ ఇండియా స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా…
స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘‘‘పెళ్లి కూతురు పార్టీ’ అని పిలిస్తే.. అక్కడేదో పెళ్లి వాతావరణం కనిపిస్తుందేమోనని అనుకున్నాను. కానీ అలాంటి వాతావరణం కనిపించలేదు. పోనీ పార్టీ ఏమైనా ఇస్తారేమో అనుకుంటే అదీ లేదు. అయితే మంచి ట్రైలర్, సాంగ్స్‌తో మెప్పించారు. చాలా బావున్నాయి. సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
డైరెక్టర్ అపర్ణ మల్లాది మాట్లాడుతూ ‘‘విజయేంద్ర ప్రసాద్‌గారు నాకు మెంటర్, గురు, ఫ్రెండ్.. ఆయన ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. రొమాంటిక్ కామెడీ, అడ్వెంచర్ జోనర్ మూవీ ఇది. ఫిమేల్ ప్రొటాగనిస్ట్ మూవీ. అనీషా దామా ఇందులో మెయిన్ పాత్ర చేశారు. మహర్షి, ఓ బేబి, గీత గోవిందం చిత్రాల్లో ఈమె నటించారు. అయితే లీడ్ ఆర్టిస్ట్‌గా ఆమెకు ఇదే తొలి చిత్రం. అనీషా దామ జోడీగా ప్రిన్స్ నటించారు. ఈ సినిమాతో ప్రిన్స్ మంచి హిట్ కొడతాడు. అలాగే అన్నపూర్ణమ్మ చాలా కీలక పాత్రను పోషించారు. అలాగే ఈ సినిమా ద్వారా భావన వజపండల్ అనే మరో హీరోయిన్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. పవన్ సురేశ్ ఈ చిత్రంలో కామెడీ విలన్‌గా కనిపిస్తారు. ఇందులో నటించిన వారందరూ తెలుగు అమ్మాయిలే. మా సినిమాకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చిన ప్రిన్స్, సాయికేతన్, అర్జున్ కళ్యాణ్‌కు థాంక్స్. కేరాఫ్ కంచరపాలెం, మిడిల్ క్లాస్ మెలొడీస్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన స్వీకర్ అగస్తి ఈ సినిమా సంగీతాన్ని అందిస్తున్నారు. తుంబ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించిన నరేన్ ఎలాన్ ఈ సినిమాకు విజువల్స్ అందించారు. వీరితో పాటు మంచి టీమ్ ఈ సినిమాకు వర్క్ చేశారు. నిర్మాత స్వామిగారు నేను చేయాలనుకున్న సినిమాను స్వేచ్ఛగా చేయనిచ్చారు. అందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు’’ అన్నారు.
అనీషా దామ మాట్లాడుతూ ‘‘ఏడాది ముందు ఈ ‘పెళ్లికూతురు పార్టీ’ జర్నీని స్టార్ట్ చేశాం. నాపై నమ్మకంతో నాకు మెయిన్ లీడ్ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అపర్ణగారికి, నిర్మాత స్వామిగారికి థాంక్స్. చాలా సపోర్ట్ చేశారు. నరేన్‌గారు నన్ను ఎంతో అందంగా చూపించారు. ప్రతి ఒక్కరూ పడ్డ కష్టంతో మంచి సినిమా చేశాం. అందరికీ థాంక్స్’’ అన్నారు.
ప్రిన్స్ మాట్లాడుతూ ‘‘అపర్ణగారికి థాంక్స్. టీమ్ అంతా ఎంతో కష్టపడి సినిమాను రూపొందించాం’’ అన్నారు. నిర్మాత ఎ.వి.ఆర్.స్వామి మాట్లాడుతూ ‘‘సినిమాను పూర్తి చేశాం. అందరి సపోర్ట్‌తో సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయాలని అనుకుంటున్నాం’’ అన్నారు.
నటీనటులు: అనీషా దామ, ప్రిన్స్, భావన వజపండల్, అన్నపూర్ణ, అర్జున్ కళ్యాణ్, పవన్ సురేశ్, భావన, సాయికేతన్ రావు, జయేత్రి, కిరాక్ సీత తదితరులు
సాంకేతిక వర్గం:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: అపర్ణ మల్లాది
నిర్మాత: ఎ.వి.ఆర్.స్వామి
బ్యానర్: పృథ్వీ క్రియేషన్స్
సినిమాటోగ్రఫీ: నరేన్ ఎలాన్
మ్యూజిక్ డైరెక్టర్: స్వీకర్ అగస్తి
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
ప్రొడక్షన్ డిజైనర్: రేచెల్ వర్మ
కొరియోగ్రీఫీ: విశ్వా రఘు
యాక్షన్: రాబిన్ సుబ్బు
కాస్ట్యూమ్స్: వర ప్రసాద్ శిష్ట
పి.ఆర్.ఓ: వంశీ శేఖర్