రావి ఆకులతో ఉపయోగాలు తెలుసా?

75
- Advertisement -

రావి ఆకులను పూర్వం నుంచి కూడా ఆయుర్వేదంలో వివిద ఔషధాల తయారీలో ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇందులోని ఔషధ గుణాలు ధీర్ఘకాళిక వ్యాధులను దూరం చేయడంలో ఎంతగానో సహాయపడతాయట. అందుకే ఆయుర్వేదంలో రవి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. కేవలం రావి ఆకులు మాత్రమే కాకుండా బెరడు,రావి గింజలలో కూడా అద్బుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రావి ఆకులను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని నీటిలో వేసి మరిగించి తాగితే డయాబెటిస్ తగ్గుముఖం పడుతుందట. ఇంకా రావిలో ఉండే ఔషధ గుణాలు ముఖ్యంగా మగవారికి ఎంతో తోడ్పడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు..

వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్నవారు రావిఆకుల కషాయం తాగితే వీర్య వృద్ది పెరుగుతుందట. ఇంకా నపుంసకత్వం నుంచి బయటపడదనికి కూడా రావి చక్కగా ఉపయోగ పడుతుందట. రావి పండ్ల పొడిని పాలలో కలిపి ప్రతిరోజూ తీసుకుంటే నపుంసకత్వం దూరం కావడమే కాకుండా కండర పుష్టి కూడా జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఇంకా మలబద్దకం, ఆస్తమా, చర్మ వ్యాధులు, కిడ్నీ సంబంధిత సమస్యలు వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలకు రావి చక్కటి పరిష్కారంగా ఉంటుంది. దంత సమస్యలు, నోటిపూత, నోటి దుర్వాసన వంటి సమస్యలు ఉన్నవాళ్ళు రావిచెట్టు బెరడును నీటిలో ఉడికించి ఆ నీటిని ప్రతిరోజూ ఉదయం నోట్లో పోసుకొని పుక్కలించడం వల్ల నోటి సమస్యలన్నీ దురమౌతాయి. ఇక డయేరియాతో బాధ పడే వారు రావి చెట్టు బెరడును దానియాలు, పట్టిక బెల్లం వంటి వాటితో కలుపుకొని పొడిగా చేసుకొని ఉదయం సాయంత్రం సేవిస్తే డయేరియా తగ్గుతుందట. ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలకు రావి చెట్టును దివ్య ఔశదంగా పరిగణిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు.

గమనిక : ఈ సమాచారం సామాజిక మాద్యమల నుంచి మీ అవగాహన మేరకు చెప్పడం జరిగింది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్న వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం

Also Read:TTD:6.47 ల‌క్ష‌ల మందికి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం

- Advertisement -