పత్తి కొనుగోళ్లలో కుంభకోణం: పెద్ది

22
- Advertisement -

2024 -2025 లో 25 లక్షల మంది పత్తి పంట పండించారు అన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. రూ.49 లక్షలు బేల్స్ పత్తి పంట పండింది..సీసీఐ కొన్నది 41 లక్షల బేల్స్ ..ప్రైవేట్ ట్రేడింగ్ జరిగింది 8 లక్షల బేల్స్ అన్నారు. సీసీఐ కి అమ్మిన రైతులు 6 లక్షల 30 వేలు మాత్రమే ..ట్రక్ పట్టీలు జారీ చేసినవి 9 లక్షలు మాత్రమే ..60 వేల టీ ఆర్ లు ప్రభుత్వం ఇచ్చింది అన్నారు.

పత్తి మద్దతు ధర క్వింటాల్ కు 7521 రూపాయలు అయితే ప్రైవేట్ మార్కెట్ లో 5500 -6000 మించలేదు ..సీసీ కెమెరాలు పరిశీలిస్తే దొంగలు దొరుకుతారు ..దీపావళి సందర్భంగా హైదరాబాద్ లో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో సీసీఐ అధికారులు ,ప్రముఖ ట్రేడర్స్ మధ్య జరిగిన రహస్య సమావేశం లో కుంభకోణానికి బీజం పడింది
..ఉత్పత్తి ఆయిన పంటకు కొన్న దానికి చాలా తేడాలు ఉన్నాయి ..ఏనభై శాతం పంటను సీసీఐ కొనుగోలు చేసిందని రికార్డులు చెబుతున్నాయి అన్నారు.

కేవలం 20 శాతం మంది రైతులే సీసీఐ కి పంట అమ్మారు …మిగతాది అంతా కాంగ్రెస్ నేతలు సిండికేట్ గా ఏర్పడి మిగతాది సీసీఐ కి అమ్ముకున్నారు …ఇందులో పెద్ద కుంభకోణం జరిగింది …కాంగ్రెస్ నేతలు చివరకు పత్తి రైతులను కూడా వదలలేదు ..మూడు వేల కోట్ల రూపాయల మేర పత్తి రైతులను నిలువు దోపిడీ చేశారు
…నకిలీ టీ ఆర్ నంబర్ల తో పత్తి రైతులను కాంగ్రెస్ నేతలు మోసం చేశారు ..పత్తి కొనుగోళ్లను సీసీఐ ఆలస్యం చేయడం వల్ల రైతులు నష్టపోయారు
..ట్రేడర్లు ,బ్రోకర్ల అకౌంట్లలో పత్తి పంట డబ్బులు పడ్డాయి …ఇందులో సీసీఐ ,మార్కెటింగ్ అధికారుల హస్తం ఉంది …పౌర సరఫరాల శాఖలో టెండర్ల కుంభకోణం లో సీఎం ,మంత్రి ఉత్తమ్ హస్తం ఉంది ..పార్టీ తరపున హై కోర్టులో పిల్ విచారణలో ఉంది .పద్నాలుగూ వాయిదాలు తీసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడం లేదు అన్నారు.

పౌరసరఫరాల శాఖలో కుంభకోణం జరిగినట్టే పత్తి కొనుగోళ్ల లో కుంభకోణం జరిగింది..పత్తి కొనుగోళ్లలో ఏడుగురు మార్కెట్ కమిటీ కార్యదర్శులు సస్పెండ్ అయ్యారు ..కొంత మందికి షోకాజులు జారీ చేశారు ..ఈ కుంభకోణం లో కాంగ్రెస్ పెద్దల హస్తం ఉంది ..రైతులు తమ పత్తి పంట ను క్విo టాల్ కు 5 వేలకు అమ్ముకుంటే బ్రోకర్లు ఏడు వేలకు పైగా దండుకున్నారు …రైతులు దాదాపు క్విoటాల్ కు 2 వేల కు పైగా నష్టపోయారు ..ఈ వ్యవహారం పై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపి దోషులను శిక్షించాలి అన్నారు.

Also Read:గోవాలోని ఆలయంలో తొక్కిసలాట.. 6గురు మృతి

- Advertisement -