ఏపీలో మొంథా తుఫాన్ మీద ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ఒక్కరు కూడా చనిపోలేదు.. కానీ తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర వల్ల 12 మంది చనిపోయారు అని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి.
మీడియాతో మాట్లాడిన పెద్ది.. ఇంకా చాలా మంది గల్లంతు అయ్యారు, కాంగ్రెస్ అసమర్థత వల్ల, ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇవాళ విధ్వంసం ఎక్కువైంది అన్నారు. తుఫాన్ ప్రభావంతో 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది.. అది ముమ్మాటికీ తప్పు అన్నారు.
పంటను అమ్మడానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లగా, అకాల వర్షాలకు పంట తడిచి రైతులు నష్టపోయారు.. వీరందరినీ ప్రభుత్వం ఆదుకోవాలి..మొక్కజొన్న పంటను కొనడానికి ప్రభుత్వం కొర్రీలు పెట్టింది.. దీంతో పంటను అమ్మడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. తేమశాతాన్ని, డ్యామేజ్ ను పరిగణనలోకి తీసుకోకుండా పత్తి, వరి, మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం అన్నారు బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి.
Also Read:సుజీత్‌పై ఇమ్రాన్ ప్రశంసలు

