రైతు రుణ మాఫీ కి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు పై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఖండించారు మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన సుదర్శన్ రెడ్డి.. .హరీష్ రావు పని విధానాన్ని తప్పు పట్టే నైతిక అర్హతా పొన్నం ప్రభాకర్ కు లేదు అన్నారు. రైతుల పక్షాన హరీష్ రావు మాట్లాడితే పొన్నం సహా మంత్రులు పిచ్చి కూతలు కూస్తున్నారు….కేవలం వార్తాపత్రికల్లో హెడ్ లైన్లలో ఉండేందుకు మంత్రులు మాట్లాడుతున్నారు అన్నారు.
31 వేల కోట్ల రూపాయలతో రుణ మాఫీ అన్నారు .18 వేల కోట్ల రూపాయలతో మమ అనిపించే ప్రయత్నం జరుగుతోందన్నారు. మా కాల్ సెంటర్ కు రుణ మాఫీ పై ఇప్పటికే 75 వేల కు పైగా పిర్యాదులు వచ్చాయి…..పంద్రాగస్టు న మూడో విడత రుణ మాఫీ అంటున్నారు ..ఆ విడత తర్వాత సీఎం ,మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగని పరిస్థితి ఉంటుందన్నారు. రైతు రుణ మాఫీ కాని రైతుల పక్షాన కేసీఆర్ నాయకత్వం లో మా పార్టీ పోరాడుతుంది అన్నారు.
లక్ష రూపాయల రుణ మాఫీ కాని వారే ఇంకా లక్షల సంఖ్య లో ఉన్నారు ….చేయని తప్పులకు రైతులను సహకార సంఘాలను ప్రభుత్వం భాద్యులను చేస్తోందన్నారు. నల్లబెల్లి మండలం లో రైతులు ,సహకార సంఘాల ను క్రిమినల్స్ లాగా చిత్రీకరిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు ..కలెక్షన్ సెంటర్లు కాంగ్రెస్ కు అలవాటు అన్నారు. అన్ని దిక్కులా కలెక్షన్ సెంటర్లు పెట్టి ప్రజలను పీడిస్తున్నారు ..రవాణా శాఖ లో ప్రతి జిల్లాకు కోటి రూపాయలు అక్రమంగా వసూల్ చేస్తున్నారు అన్నారు. పౌర సరఫరాల శాఖ లో 1832 కలెక్షన్ సెంటర్లూ పెట్టి మిల్లర్ల ను వేధిస్తున్నారు ,బిల్డర్ల నుంచి చదరపు అడుగుకు 75 రూపాయలు వసూల్ చేస్తున్నారు అన్నారు.
Also Read:తంగలాన్..ఫీల్ గుడ్ మూవీ