సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. రేపు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఏ మొహం పెట్టుకుని వరంగల్ వస్తున్నావు రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు.
నీ అవగాహన లేని పరిపాలన వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కేంద్రాల వద్ద 500 నుండి 1000 మంది రైతులు, గర్భిణీ స్త్రీలు యూరియా కోసం అవస్థ పడుతున్నారు అని దుయ్యబట్టారు.
యూరియా బ్లాక్ మార్కెట్లోకి అక్రమంగా వెళ్తుంటే ఆ విషయంపై సమీక్ష లేదు అన్నారు. యూరియా లేక నష్టపోయిన పంటల వివరాలు సేకరించి వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి.
మరోవైపు యూరియా కోసం అర్ధరాత్రి ఒంటిగంట నుండే క్యూ లైన్లు కట్టారు రైతులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో పీఏసీఎస్ వద్ద అర్ధరాత్రి ఒంటిగంట నుండి క్యూ లైన్లు కట్టి అవస్థలు పడ్డారు అన్నదాతలు.
Also Read:ట్రంప్ ఎఫెక్ట్..ఆగిపోయిన వివాహాలు!

