దేవాదుల ఏ బేసిన్‌లో ఉందో తెలియదా?:పెద్ది

9
- Advertisement -

దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిన్‌లో ఉందో తెలియని రేవంత్ రెడ్డి కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన పెద్ది… రేవంత్ రెడ్డికి బనకచర్ల ఎక్కడ ఉందో తెలియకుండా దాన్ని అడ్డుకుంటాడా ? చెప్పాలన్నారు.

రైతులకు బాకీ ఉన్న డబ్బులు నీ అయ్య మొగుడు ఇస్తాడా రేవంత్ రెడ్డి ?, రేవంత్ రెడ్డి కాళేశ్వరం పండబెట్టి పంటలు ఎండబెట్టిండు అని ఆరోపించారు. వరంగల్ ఎస్ఆర్ఎస్పీ లోని డీబీఎం – 38 అనే అతిపెద్ద కాలువ పూర్తిగా ఎండిపోయింది అన్నారు.

వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం ఒక్క ఎకరం భూమి ఉన్న రైతుకు రూ.25,000 బాకీ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం … ఇప్పుడు రూ.6,000 వేస్తే మిగతా రూ.19,000 నీ అయ్య మొగుడు ఇస్తాడా రేవంత్ రెడ్డి ? చెప్పాలని ప్రశ్నించారు.

Also Read:నైపుణ్యం ఉంటేనే సక్సెస్!

- Advertisement -