గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్ తో దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పవర్ ఫుల్ కొలాబరేషన్, అద్భుతమైన టీంతో ‘పెద్ది’ భారతీయ సినిమాలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. త్వరలోనే ఫస్ట్ సింగిల్ డేట్ లాక్ అయిందని సమాచారం. వినాయక చవితి కానుకగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ ని లాంచ్ చేస్తారని తెలుస్తోంది.
వచ్చే ఏడాది మార్చ్ 27న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా భారీ యాక్షన్ నైట్ సీక్వెన్స్ షూటింగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read:ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పు..

