PK1: ట్రెండింగ్‌లో ‘పెద్దకాపు-1’

84
- Advertisement -

సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల, ద్వారకా క్రియేషన్స్‌ పై బ్లాక్‌బస్టర్ అఖండ చిత్రాన్ని అందించిన నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డితో కలిసి విరాట్ కర్ణను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘పెద కాపు-1’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

ఇక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా విడుదల చేసిన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొద్దిగంటల్లోనే 1.5 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది.

Also Read:NBK 109:లేటెస్ట్ అప్‌డేట్

ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ఛోటా కె నాయుడు కెమెరామెన్ కాగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్స్ ఫైట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. రాజు సుందరం కొరియోగ్రాఫర్. ఆగస్టు 18న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -