స్వచ్ఛ పెద్దపల్లి…జాతీయస్థాయిలో రెండో అవార్డు

793
devasena swachh peddapalli
- Advertisement -

స్వచ్ఛత అంశంలో పెద్దపల్లి జిల్లాకు మరోమారు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా పాలనాధికారి దేవసేన గ్రామాల్లో స్వచ్ భారత్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ కృషి చేస్తున్నారు. జిల్లాలో సుమారు ఒక లక్షా 35 వేళ్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించి, ఓడిఎఫ్ గా ప్రకటించడం జరిగింది. అనంతరం జిల్లాలో నిర్మించిన మరుగుదొడ్లను ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించాల్సిందిగా జిల్లా కలెక్టర్ కళాకారులచే ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఓడిఎఫ్ ను సుస్థిరత చేసుకునే దిశగా ఓడిఎఫ్ ప్లస్ కార్యక్రమాన్ని పకడ్బందీగా పక్కా ప్రణాళికతో ప్రతి గ్రామంలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ కార్యక్రమంలో జిల్లాకు జాతీయ స్థాయిలో మూడో స్థానం, దక్షిణ భారతదేశంలో మొదటి స్థానం లభించింది. దీనికోసం అధికారులను సిబ్బందిని ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ అన్ని వర్గాల వారి సహకారంతో క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షిస్తూ జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు రాబట్టడంలో కలెక్టర్ కీలక పాత్ర పోషించారు. జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు లభించడానికి అవసరమైన అన్ని చర్యలను పక్కా ప్రణాళికతో చేపట్టి సకాలంలో పూర్తి చేయడం జరిగింది. అదే స్ఫూర్తితో జిల్లాలో స్వచ్ఛత కార్యక్రమాలను కలెక్టర్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు.

గ్రామాల్లో నీటి నిలువ ఉండకుండా, నల్లాలను మూసివేస్తూ వాటి స్థానంలో పచ్చదనం పెంపొందించే దిశగా కలెక్టర్ పక్కా ప్రణాళిక రూపొందించారు. దీనిని సాధించేందుకు గ్రామంలోని ప్రతి ఇంట్లో మ్యాజిక్ సోప్ పెట్ నిర్మాణం చేపడుతున్నారు. గ్రామాల్లో ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టుకొని భూగర్భ జలాలను పెంపొందించడానికి పెద్ద ఎత్తున ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం జనవరి మాసంలో నిర్వహించిన స్వచ్ఛ సుందర్ షౌచాలయ్ కార్యక్రమంలో జిల్లా కు మరోమారు జాతీయస్థాయి గుర్తింపు రావాలని అని కలెక్టర్ పట్టుదలతో అధికారుల సహకారం తీసుకుంటూ ప్రణాళిక రూపొందించి అమలు చేశారు. జనవరి మాసంలో జిల్లా కలెక్టర్ జిల్లాలోని మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడం వాటివల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగింది.

devasesa collector

జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు ,అంగన్వాడీలు ఆధ్యాత్మిక ప్రదేశాలు వద్ద మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచి, వాటిపై రంగులతో కూడిన పెయింటింగ్స్ సైతం వేయడం జరిగింది. జిల్లాలో 1,24,461 మరుగుదొడ్లను శుభ్రపరిచి వాటిపై పెయింటింగ్స్ వేయడం జరిగింది. జిల్లాలోని అధికారులు ,స్వశక్తి సంఘాల మహిళలు, స్థానిక ప్రజా ప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం జరిగింది. మూడు దశల్లో ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించారు. మొదటి దశలో మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడం పై ప్రజలకు అవగాహన కల్పించారు, రెండవ దశలో లో జిల్లా లోని మరుగుదొడ్లను పరిశుభ్రం చేసి వాటిపై పెయింటింగ్స్ వేయాల్సిన నా సంఖ్య ను గుర్తించారు, చివరిదశలో సదరు మరుగుదొడ్ల పై పగడ్బందీగా పెయింటింగ్ లు వేయడం జరిగింది. గ్రామాల్లో స్వచ్ఛత పట్ల సమావేశాలు నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది, అదే సమయంలో ప్రజల నుండి సలహాలను సూచనలను స్వీకరించాం. గ్రామాల్లోని స్వశక్తి సంఘాల మహిళలు ఇతర మహిళలచే వాట్సాప్ గ్రూపులను తయారుచేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా సమన్వయంతో పని చేయడం జరిగింది, ప్రజలకు వచ్చే వినూత్న ఆలోచనలు ఈ వేదిక ద్వారా జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్ వద్దకు తీసుకుని వెళ్లారు. దీనికి ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన లభించింది, పండుగ వాతావరణంలో జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమంలో స్వయంగా భాగస్వామ్యం తీసుకొని, సబ్బితం గ్రామంలో కలెక్టర్ స్వయంగా మరుగుదొడ్ల పై పెయింటింగ్ వేసి, వాటిని శుభ్రం చేయడం ద్వారా ప్రజలకు ఆదర్శంగా నిలిచి వారిలో స్ఫూర్తిని నింపారు. జిల్లా కలెక్టర్ నింపిన స్ఫూర్తి తో జిల్లాలోని స్వశక్తి సంఘాల మహిళలు, పాఠశాల విద్యార్థులు వినూత్న ఆలోచనలతో మరుగుదొడ్లను శుభ్రం చేసి అలంకరించారు. జిల్లాలోని స్వశక్తి సంఘాల మహిళలు మరుగుదొడ్లను శుభ్రపరచడం వాటి యజమాని తో సహా ఆ ఫోటోలను తీసే ప్రక్రియ స్వయంగా పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ అధికారుల సమన్వయంతో చేసిన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సుందర్ షౌచాలయ్ కార్యక్రమం కింద పెద్దపల్లి జిల్లాను గుర్తించి జాతీయస్థాయిలో అవార్డు అందజేస్తున్నారు. ఈ అవార్డును జూన్ 24, 2019 సోమవారం నాడు ఢిల్లీలో జిల్లా కలెక్టర్ గారు జిల్లా తరఫున స్వీకరిస్తారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ దర్పం అనే కార్యక్రమంలో సైతం పెద్దపెల్లి జిల్లా జాతీయస్థాయిలో ముందంజలో మొదటి స్థానంలో ఉంది. వీటి ఫలితాలు ఆగస్టు మాసంలో వెల్లడించే అవకాశం ఉంది.

స్వచ్ఛ దర్పం లో సైతం ప్రథమంగా నిలిచి పెద్దపల్లి జిల్లా ను దేశవ్యాప్తంగా ఆదర్శ జిల్లా తీర్చిదిద్దాలని కలెక్టర్ పట్టుదలతో పని చేస్తున్నారు. జిల్లాలో పరిసరాల పరిశుభ్రత తో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పై కూడా కలెక్టర్ దృష్టిసారించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం అని దానికి సంబంధించి ప్రజలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న అనంతరం నిర్వహించిన ఎన్ సిడి సర్వేలో మహిళల్లో ఉన్న అనారోగ్య సమస్యలు అధికంగా ఉండటం కలెక్టర్ గమనించారు. జిల్లాలో అధిక శాతం మహిళలు నెలసరి సమయాల్లో అపరిశుభ్రత గుడ్డలను వాడటం దీనికి ప్రధాన కారణం అని గుర్తించి , ఆ అంశం పట్ల ప్రజలలో అవగాహన కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని స్వశక్తి మహిళా సంఘానికి రూ.40 లక్షలు బ్యాంక్ రుణ సౌకర్యం కల్పించి, వారిచే సభల అనే శానిటరీ నాప్కిన్ యూనిట్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. వీటి ద్వారా పర్యావరణానికి ఎలాంటి నష్టం కలగకుండా అత్యంత నాణ్యతతో కూడిన బయోడిగ్రేడబుల్ సానిటరీ నాప్కిన్లు తయారుచేసి అతి తక్కువ ధరలకు ప్రజలకు అందిస్తున్నారు.

సభల శానిటరీ నాప్కిన్ లను ఉపయోగించ వలసిందిగా సందేశం అందిస్తూ సైతం మరుగుదొడ్ల పై పెయింటింగ్స్ వేయడం జరిగింది. గ్రామాల్లో పరిశుభ్రతతో పాటు పచ్చదనం పెంపొందించే దిశగా సైతం కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారిం చారు. గ్రామాల్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి సేకరించే దిశగా కలెక్టర్ ప్రణాళికలు రూపొందించి అమలుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. చెత్త నిర్వహణ విషయంలో ప్రజల నుండి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అవసరమని గుర్తించిన జిల్లా కలెక్టర్, తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం ద్వారా కలిగే లాభాలను ప్రజలకు వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పరిశుభ్రత పాటించడం భగవత్ స్వరూపమని జిల్లా కలెక్టర్ బలంగా విశ్వసిస్తు, ఆ దిశగా అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అవసరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, వారి నుండి సలహాలు సూచనలు స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నారు.

devasena

జిల్లాకు రెండవసారి జాతీయస్థాయి గుర్తింపు లభించిన సమయంలో జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన మాట్లాడుతూ అధికారుల కృషి ప్రజల సహాయ సహకారాల కారణంగా జిల్లాకు స్వచ్ఛత అంశంలో జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ,ఇదే స్ఫూర్తితో స్వచ్ఛ పెద్దపల్లి సాధించే దిశగా నిరంతరం కృషి చేస్తామని, క్షేత్రస్థాయిలో వాస్తవాలు గమనిస్తూ ప్రజల సలహాలను సహకారాలను తీసుకుంటూ వారి భాగస్వామ్యంతో ముందుకు వెళ్తామని తెలిపారు. జిల్లాలో స్వచ్ఛత అంశం పట్ల జాతీయస్థాయి గుర్తింపు లభించడానికి కృషి చేసిన అధికారులకు ,సిబ్బందికి ప్రజాప్రతినిధులకు సహకరించిన ప్రజలకు కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ,ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

- Advertisement -