- Advertisement -
గౌరవ రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా పురుషోత్తం వి డీఎఫ్ఓ భూపాలపల్లి విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన పెద్దపల్లి డిఎఫ్ఓ ఎం రవి ప్రసాద్ అర్బన్ పార్క్ కుందన్ పల్లి, రామగుండంలో మూడు మొక్కలు వేప, రావి, జువ్వి మొక్కలను నాటారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అడవుల సంరక్షణ కోసం తీసుకుంటున్న చొరవ, చూపుతున్న శ్రద్ధ ఇంతవరకు ఏవరు తీసుకోలేదన్నారు. అడవిలో అక్రమ కలప రవాణ, అడవిని నరికే వారిపై కఠిన చర్యలు తీసున్నామన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటడం, వాటిని ఎదిగే బాధ్యత తీసుకునేలా ప్రజల్లో మంచి అవగాహనా కల్పించారు.ఈ ఛాలెంజ్ కార్యక్రమంలో తన సహచరులందరు పాల్గొనాలని పిలుపిచ్చారు.
- Advertisement -