అతివేగం అంతులేని శోకం..ఆలోచింపజేసే నెంబర్ ప్లేట్

481
number plate
- Advertisement -

రోడ్లపై మనం నిత్యం రకరకాల వాహనాలను చూస్తు ఉంటాం. వాటిలో వివిధ రకాల రంగులు, విభిన్నమైన నంబర్ ప్లేట్ కలిగిన వాహనాలు కనిపిస్తుంటాయి. ఈ తేడాను పెద్దగా పట్టించుకోం. కొంతమంది నంబర్ ప్లేట్‌పై తమకు నచ్చిన నాయకుల ఫోటోలు,పార్టీ గుర్తులు ఇంకా అడుగు ముందుకెస్తే కులం కార్డు. ఇప్పటివరకు మనం ఇలాంటి నంబర్‌ ప్లేట్లనే చూసుంటాం.

కానీ తాజాగా మీరు చూసిన ఈ నెంబర్‌ ప్లేట్ ఇందుకు పూర్తిగా విరుద్దం. ఎందుకంటే మానవ తప్పిదాల వల్లనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఓవర్ స్పీడ్‌,అజాగ్రత్తతో నడిపి విలువైన తమ ప్రాణాలను తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో పెద్దపల్లి యువకుడు చేసిన ఆలోచన అందరిని ఆలోచించేలా చేసింది. ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా నెంబర్‌ ప్లేట్‌ను తన బైక్‌కు అమర్చాడు. ఏ విధమైన వేగంతో వెళ్తే ఎలా ఉంటుంనే మెసేజ్‌ని అందరికి అర్ధమయ్యేలా డిజైన్ చేయించాడు. స్పీడ్‌ 40-60 వెళ్లివస్తా,80-100 పోతున్నా,120-140 నన్ను మరిచి పో అని రాయించాడు. అంతేగాదు నంబర్ ప్లేటులో 0 నుండి 140 వరకు స్పీడ్‌ లిమిట్ అంకెలు వేసి మధ్యలో పుర్రె గుర్తు(డేంజర్‌) దానిచుట్టూ రెడ్ లైన్‌ మార్క్ వేయించాడు. 60 స్పీడ్‌కి గ్రీన్ కలర్,80 స్పీడుకి ఎల్లో కలర్‌ ఇచ్చిన ఆ యువకుడు 100 నుండి 140 డేంజర్‌ అని తెలిసేలా రెడ్‌ కలర్‌ మార్క్ వేయించాడు.

ప్రస్తుతం ఈ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందరికి ఉపయోగపడే ఆలోచన చేశావని ఆ యువకుడిపై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

- Advertisement -