రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు, సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పెదరాయుడు. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ఆల్ టైం తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అన్నదమ్ముల అనుబంధం గురించి తెలుగు తెరపై ఆవిష్కృతమైన బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో ‘పెదరాయుడు’ ఒకటిగా నిలిచింది.
సినిమాలోని పాటలు, డైలాగ్‌లు ఇప్పటికి ప్రేక్షకులకు గుర్తిండే ఉంటాయి. పెదరాయుడిగా మోహన్ బాబు,పాపారాయుడిగా రజనీ నటన సూపర్బ్. ఈ సినిమా ముహుర్తపు షాట్‌కు ఎన్టీఆర్ క్లాప్ కొట్టగా ఆయనే తిరిగి 200 రోజుల ఫంక్షన్‌కి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. మోహన్ బాబు కెరీర్‌లోనే ఎప్పటికి చెప్పుకునే చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం 25 వారాలు విజయవంతంగా ఆడింది. కోటి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీనే.
1994 లో శరత్ కుమార్ కథానాయకుడిగా తమిళంలో వచ్చిన నట్టమై మంచి విజయాన్ని సాధించింది. రజనీకాంత్ ఈ సినిమాను చూసి మోహన్ బాబుకు ఫోన్ చేసి ఈ చిత్రాన్ని చూడమన్నాడు. ఈ కథను తెలుగులో తెరకెక్కిస్తే మంచి విజయాన్ని సాధిస్తుందని తన అభిప్రాయాన్ని చెప్పాడు. మోహన్ బాబు వెంటనే ఆ చిత్రానికి హక్కులు కొనుగోలు చేశాడు. ఈ కథను రవిరాజా పినిశెట్టి అయితే బాగా తెరకెక్కించగలడని మోహన్ బాబు ఆయనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు.
పెదరాయుడు 26 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు మోహన్ బాబు. ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం అసాధ్యం అనుకుంటున్నా… భవిష్యత్తులో విష్ణు, మనోజ్‌కి సీక్వెల్ చేసే అవకాశం ఉండొచ్చేమోనని తెలిపారు.