ప్చ్.. సిద్ధార్థ్ ఆశ అత్యాశే

51
- Advertisement -

‘హీరో సిద్ధార్థ్’ హీరోగా ఫేడ్ అవుట్ అయిపోయాక… మళ్లీ హీరోగా చేసిన సినిమా ‘టక్కర్’. ఈ సినిమాతో ప్రేక్షకులను ఎలాగైనా అలరిస్తానని చెబుతున్నాడు. ఐతే, ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోకి ఎలా అయితే మార్కెట్ లేదో.. ఈ దర్శకుడికి కూడా అలాగే మ్యాటర్ లేదు. ఏదో రొటీన్ రొట్ట కొట్టుడు కంటెంట్ తో తన లక్ ను పరీక్షించుకోబోతున్నాడు. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తోంది. నిన్న రాత్రి 7 గంటలకు ‘టక్కర్’ మూవీ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. టీజర్ కి పెద్దగా వ్యూస్ రాకపోయినా, పెయిడ్ ప్రమోషన్స్ తో ముందుకు లాగుతున్నారు.

also read: ఎన్టీఆర్ తో అందుకే ఒప్పుకున్నాడు

ఇక ‘టక్కర్’ మూవీ టీజర్ విషయానికి వస్తే.. రొమాన్స్, యాక్షన్ మేళవింపుతో రూపొందిన ఈ టీజర్ పర్వాలేదు అనిపించింది. “నేనంటే ఇష్టం లేదా” ?, “లవ్ అంటేనే ఇష్టంలేదు” అంటూ సిద్ధార్థ్ – దివ్యాంశ కౌశిక్ ల సంభాషణలతో టీజర్ ప్రారంభమైంది. అసలు ప్రేమ అనేదే లేదని నమ్మే యువతికి ఓ యువకుడు దగ్గరవ్వడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి ?, ఈ ప్రేమ నేపథ్యంలో రూపొందిన ఈ టీజర్ సినిమా పై ఎలాంటి ఇంట్రెస్ట్ ను పెంచలేకపోయింది. టీజర్ మేకింగ్ దగ్గర నుంచి టేకింగ్ వరకూ అన్నీ రొటీన్ గానే సాగాయి.

also read: షూటింగ్ పూర్తి చేసుకున్న హను-మాన్‌..!

అయినా, కొత్తదనం లేని ప్రేమ కథలను ఈ తరం ప్రేక్షకులు అసలు చూడటం లేదు. మరి పాత చింతకాయ పచ్చడి ప్రేమ కథతో హిట్ కొడదాం అని సిద్ధార్థ్ ఆశ పడటం అత్యాశే అవుతుంది. ఇక ఈ టీజర్ లో ఏమైనా ప్లస్ పాయింట్ అంటూ ఉంటే.. అది కచ్చితంగా దివ్యాంశ కౌశిక్ గ్లామరే. పైగా ఆమె తన అందచందాలు దాచుకోకుండా విశాల హృదయంతో సాంతం పరిచేసింది. ఏది అయితే ఏం మొత్తానికి సిద్ధార్థ్ కి ‘టక్కర్’ పెద్దగా కలిసొచ్చేలా లేదు. టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు లో విడుదల చేస్తున్నారు. మే 26న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

- Advertisement -