కార్పొరేటర్ స్థాయి వ్యక్తి ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైతే ఎలా ఉంటుందో బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ను చూస్తే అర్థమవుతుందని ఎద్దేవా చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఉత్తమ్…తననుద్దేశించి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. తాను దేశ సరిహద్దులో పనిచేసిన వ్యక్తినని, అవినీతి, అక్రమాలకు పాల్పడాల్సిన అవసరం లేదన్నారు.
ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. తాను హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఎక్కడా భూములు కబ్జాకు గురికాలేదని తెలిపారు. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు.
గిరిజనుల హక్కులు కాపాడటానికి ఉద్యమం చేసిన ఉత్తమ్‌పై నిందలు వేయడం సమంజసం కాదన్నారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. భూములను 12 ఏళ్లపాటు ఎవరు సాగు చేస్తే వారివే అవుతాయని చెప్పారు.